Naresh: లెఫ్టినెంట్ కల్నల్ గా గౌరవం అందుకున్న నటుడు నరేష్!

  • November 26, 2023 / 08:43 PM IST

సినీ నటుడు నరేష్ అత్యుత్తమమైనటువంటి బిరుదును సొంతం చేసుకున్నారు. ఒకేసారి ఈయన రెండు బిరుదులను అందుకున్నారు. అది కూడా విదేశాలలో ఈ బిరుదు అందుకోవటం విశేషం ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరోకి లేనటువంటి గౌరవాన్ని నరేష్ అందుకున్నారు. యునైటైడ్‌ నేషన్స్‌లోని ముఖ్య విభాగం నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సెక్యూరిటీ అండ్‌ డిఫెన్స్‌ ప్లానింగ్‌ నుంచి గౌరవ డాక్టరేట్‌ను ఆయన అందుకున్నారు. శుక్రవారం ఫిలిప్పీన్స్‌లోని మనీలా క్యూజోన్‌ నగరంలో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలలో ఈయన ఈ బిరుదుతో పాటు లెఫ్టినెంట్ కల్నల్ గా గౌరవ డాక్టరేట్‌ను అందించారు.

ఆర్బిట్రేషన్ అండ్ శాంతి కోసం జరిగే విషయాలలో మధ్యవర్తిత్వానికి సహచరుడిగా (Naresh) నరేష్ కు ఈ గౌరవాన్నిఅందించినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఫౌరహక్కుల సంరక్షకుడిగా నరేష్ ను గుర్తించారు. ఈ వేడుకలకు నేషనల్‌ ఆకాడమీ ఆఫ్‌ సెక్యూరిటీ అండ్‌ డిఫెన్స్‌ ప్లానింగ్‌ జనరల్‌ దివాకర్‌ చంద్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నరేష్‌ తన స్పీచ్ తో ఆకకట్టుకున్నారు.

ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో వివిధ దేశాల ప్రభుత్వాలు, ఐక్యరాజ్య సమితి గొప్పగా కృషి చేస్తున్నాయని తెలిపారు. తన స్పీచ్ తో మరోసారి నరేష్ అందరిని ఆకట్టుకున్నారు. ఇలా నరేష్ ఈ విధమైనటువంటి గౌరవాలను అందుకోవడంతో అందరూ ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపై ఈయనని ఎవరైన పిలవాలి అంటే సార్ అని పిలవాల్సిందేనని అలాగే ఈయన పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్ అని కూడా పెట్టుకోవచ్చు అని తెలుస్తుంది.

సినిమాలలో నటుడిగా నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన తన వ్యక్తిగత విషయాల ద్వారా మాత్రం పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు. కానీ ఇలాంటి వ్యక్తి ఈ అరుదైనటువంటి బిరుదులను గౌరవాన్ని అందుకోవడంతో అభిమానులు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus