Sound Party Review in Telugu: సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 24, 2023 / 04:07 PM IST

Cast & Crew

  • వీజే సన్నీ (Hero)
  • హృతిక శ్రీనివాస్‌ (Heroine)
  • శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, చలాకి చంటి త‌దిత‌రులు. (Cast)
  • సంజ‌య్ శేరి (Director)
  • రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర (Producer)
  • మోహిత్ రెహమానిక్ (Music)
  • శ్రీనివాస్ రెడ్డి (Cinematography)

‘బిగ్ బాస్ సీజన్ 5 ‘ విన్నర్ అయిన సన్నీ అందరికీ సుపరిచితమే. బుల్లితెర పై ఇతనికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ‘బిగ్ బాస్’ కంటే ముందు ఇతను సీరియల్స్ లో నటించేవాడు. అలాగే హీరోగా కూడా ఓ సినిమా చేశాడు. అయితే ‘బిగ్ బాస్’ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని భావించో ఏమో కానీ సన్నీ వరుసగా హీరోగానే సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో చేసిన ‘అన్ స్టాపబుల్’ ప్లాప్ అయ్యింది. అయినా సరే ‘సౌండ్ పార్టీ’ అనే మరో సినిమా కూడా చేశాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :

కథ: కుబేర్‌ కుమార్‌(‘అమృతం’ ఫేమ్ శివన్నారాయణ) బాగా డబ్బు సంపాదించి సుఖంగా జీవించాలి అనుకునే వ్యక్తి. అతని ఫ్యామిలీ అనగా తండ్రి, తాత ముత్తాత కూడా అలాగే ఆశపడి జీవిస్తారు. ఇక ఇతని ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ అయిన డాలర్ కుమార్‌(వీజే సన్నీ) కూడా అలాంటి ఊహల్లోనే జీవిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ హాఫ్ మైండెడ్. అంటే విడి విడి జ్ఞానం కలిగిన వారు అనుకోవచ్చు. ఇదిలా ఉండగా.. కుబేర్‌ కుమార్‌, డాలర్‌ కుమార్‌ కి మంచి బాండింగ్ ఉంటుంది.

అయితే వీరికున్న హాఫ్ నాలెడ్జ్ తోనే తక్కువ టైంలో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో రూ.30 లక్షలు అప్పు చేసి గోరుముద్ద హోటల్‌ అనే హోటల్ ను ప్రారంభిస్తారు. దానికి మొదట్లో మంచి డబ్బులు వస్తాయి కానీ సిరి(హీరోయిన్ హృతిక శ్రీనివాస్‌) తండ్రి వల్ల చెడిపోతుంది. ఆ తర్వాత ఆ హోటల్ ను సీజ్‌ చేసే వరకు వెళ్తుంది విషయం. ఈ క్రమంలో వీరికి అప్పు ఇచ్చిన సేటు నాగభూషణం(నాగిరెడ్డి) టార్చర్ ఎక్కువవుతుంది.

దీంతో ఏమీ చేయలేక.. తాగుడుకి బానిసలైపోతారు. అదే టైంలో ఎమ్మెల్యే వరప్రసాద్‌(పృథ్వీ) కొడుకు భువన్‌ ఓ అమ్మాయిని రేప్ చేస్తాడు. అయితే అది దొంగతనం కేసు అని… అది తమ మీదేసుకుంటే రూ.2 కోట్లు ఇస్తామని కుబేర్‌ కుమార్‌, డాలర్‌ కుమార్‌లకు ఆఫర్‌ ఇచ్చి వీరిని బురిడీ కొట్టిస్తారు ఎం.ఎల్.ఎ బ్యాచ్. విషయం తెలియకుండా వీరు ఆ కేసును తమ పై వేసుకోగా… ఇద్దరికి ఉరిశిక్ష విధిస్తుంది కోర్టు.విషయం ఆలస్యంగా తెలుసుకున్న కుబేర్ కుమార్, డాలర్ కుమార్..లు చివరికి ఎలా బయట పాడారు అనేది మిగిలిన కథ

నటీనటుల పనితీరు: హీరో కంటే ముందుగా మనం కుబేర్‌ కుమార్‌ పాత్ర చేసిన శివన్నారాయణ గురించి చెప్పుకోవాలి. ‘అమృతం’ సీరియల్లో అప్పాజీ పాత్రతో ఫేమస్ అయిన ఈయన ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించారు. చిన్న చిన్న పాత్రలే చేసినప్పటికీ ఉన్నంతలో తన మార్క్ యాక్టింగ్ తో నవ్వించేవారు. అయితే ఎందుకో ఈయనకి ఫుల్ లెంగ్త్ రోల్స్ ఎక్కువగా రాలేదు. అందువల్ల దక్కాల్సిన గౌరవం కూడా ఇంకా దక్కలేదు అనిపిస్తుంది. అయితే ‘సౌండ్ పార్టీ’ లో ఈయన నటన చాలా బాగుంది. ఇలాంటి ఫుల్ లెంగ్త్ రోల్స్ ఈయన ఇంకా చేస్తే బాగుణ్ణు అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది.

ఇక హీరో సన్నీ డాలర్‌ కుమార్‌ పాత్రలో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. ‘అన్ స్టాపబుల్’ తో పోలిస్తే ఇందులో అతను బెటర్ గా పెర్ఫార్మ్ చేశాడు అని చెప్పొచ్చు. శివన్నారాయణ – సన్నీ కాంబోలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సిరి పాత్రలో హృతిక బాగానే పెర్ఫార్మ్ చేసింది. అయితే ఆమె మేనత్త ఆమని రేంజ్లో క్లిక్ అవుతుందా అంటే..అప్పుడే అంచనా వేయలేం. ఇక పృథ్వీ,అలీ,నాగిరెడ్డి ,చలాకీ చంటి,సప్తగిరి, ప్రియా వంటి వారు పర్వాలేదు అన్నట్టుగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: ఈ విభాగంలో మనం ఎక్కువగా మోహిత్‌ రెహమానిక్ గురించి చెప్పుకోవాలి. పాటలు పర్వాలేదు, ఆర్‌ఆర్‌ కూడా ఆకట్టుకునే విధంగానే ఉంది అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ అందించిన శ్రీనివాస్‌ రెడ్డి కూడా పర్వాలేదు.నిర్మాణ విలువలు కథకి తగ్గట్టు బాగున్నాయి.విజువల్స్ అందరికీ గుర్తుంటాయి. ఇక దర్శకుడు సంజయ్‌ శేరి విషయానికి వస్తే.. అతను ఎంపిక చేసుకున్న పాయింట్ కొత్తదేమీ కాదు. డబ్బు చుట్టూ తిరిగే కామెడీ జోనర్ సినిమాలు మనం అనేకం చూశాం.

గతేడాది వచ్చిన ‘ఎఫ్ 3 ‘ కథ కూడా ఇలాగే ఉంటుంది. కామెడీ విషయంలో ఓకే కానీ ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ అయ్యింది. దాని విషయంలో ఫోకస్ చేసుంటే ఇంకా బాగుండేది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ లో అసలు పాయింట్ ను వదిలేసి నడిపే కామెడీ ట్రాక్ లు ఇబ్బంది పెడతాయి.మళ్ళీ క్లైమాక్స్ పోర్షన్ ఓకే అనిపిస్తుంది.

విశ్లేషణ: మొత్తంగా ఈ (Sound Party) ‘సౌండ్ పార్టీ’… కొన్ని నవ్వుల కోసం ఒకసారి చూడొచ్చు. సెకండ్ హాఫ్ పై ఇంకాస్త ఫోకస్ పెట్టి.. ఎమోషనల్ కనెక్టివిటీ ఉండేలా జాగ్రత్తపడుంటే.. కచ్చితంగా ఈ సినిమా స్థాయి మరోలా ఉండేది. ఈ సినిమాతో సన్నీ బాక్సాఫీస్ సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి మరి..!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus