Aadikeshava Review in Telugu: ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 24, 2023 / 09:28 AM IST

Cast & Crew

  • పంజా వైష్ణవ్ తేజ్ (Hero)
  • శ్రీలీల (Heroine)
  • జోజు జార్జ్, రాధిక, అపర్ణ దాస్, సుమన్ తదితరులు.. (Cast)
  • శ్రీకాంత్ ఎన్.రెడ్డి (Director)
  • నాగవంశీ - సాయిసౌజన్య (Producer)
  • జి.వి.ప్రకాష్ కుమార్ (Music)
  • డూడ్లీ (Cinematography)
  • Release Date : నవంబర్ 24, 2023

“ఉప్పెన, కొండ పొలం” లాంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగా ఫ్యామిలీ హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన మూడో చిత్రం “ఆదికేశవ్”. పలు చిత్రాలకు రచయితగా పని చేసిన శ్రీకాంత్ ఎన్.రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మలయాళ నటుడు జోజు జార్జ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రం పలుమార్లు పోస్ట్ పొన్ అయ్యి నేడు (నవంబర్ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. నిర్మాత నాగవంశీ సినిమా మీద నమ్మకంతో ఒకరోజు ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోస్ నిర్వహించారు. మరి సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అనేది తెలుసుకొందాం..!!

కథ: తండ్రి సంపాదించిన డబ్బును ఖర్చు చేస్తే, జీవితంలో ఎలాంటి గోల్ లేకుండా జల్సా చేస్తూ బ్రతికేస్తుంటాడు బాలకోటయ్య అలియాస్ బాలు (పంజా వైష్ణవ్ తేజ్), ఉద్యోగం కోసం వెళ్ళిన కంపెనీ సీ.ఈ.ఓ చిత్రావతి (శ్రీలీల)ను తొలిచూపులోనే ప్రేమించి ఆమెను పెళ్లాడడం కోసం ప్రయత్నిస్తుంటాడు.

కట్ చేస్తే.. రాయలసీమలోని ఒక ప్రాంతంలో చెంగారెడ్డి (జోజు జార్జ్) అనే విపరీతబుద్ధి కలిగిన వ్యక్తి చేసే ఆకృత్యాల కారణంగా ఓ ఊరు మొత్తం ఇబ్బండిపడుతుంటుంది. ఊళ్ళో పిల్లల నుంచి గుళ్ళో దేవుడి వరకూ ఎవర్నీ వదలకుండా, అందర్నీ హరించడానికి ప్రయత్నించిన చెంగారెడ్డికి.. అడ్డు నిలుస్తాడు బాలకోటయ్య.

అసలు బాలకోటయ్యకు, చెంగారెడ్డికి సంబంధం ఏమిటి? అత్యంత బలవంతుడైన చెంగారెడ్డిని బాలు ఎలా ఎదుర్కొన్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “ఆదికేశవ్” చిత్రం.

నటీనటుల పనితీరు: వైష్ణవ్ తేజ్ ఒక్కో సినిమాలో తనలోని టాలెంట్స్ ను చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ చిత్రంలో తన స్టైల్ తోపాటు డ్యాన్స్ తో ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ కొడుకు రోషన్ తర్వాత శ్రీలీల పక్కన సమానమైన గ్రేస్ తో స్టెప్పులు వేసిన ఏకైక హీరో వైష్ణవ్ తేజ్ అనే చెప్పాలి. క్యారెక్టర్ కు సరైన స్కోప్ లేదు కానీ.. ఉండి ఉంటే నటుడిగానూ తన సత్తా చాటుకోనేవాడు వైష్ణవ్ తేజ్.

శ్రీలీల ఎప్పట్లానే పాత్ర పరిధిలో గ్లామర్ & డ్యాన్సులతో మెప్పించింది. తల్లి పాత్రలో రాధిక, ప్రత్యేక పాత్రలో సుమన్ అలరించారు. స్నేహితుడిగా సుదర్శన్ పంచ్ లు ప్రేక్షకుల్ని నవ్వించాయి. ఇక మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాలో చెంగారెడ్డి అనే కరడుగట్టిన విలన్ గా పర్వాలేదు అనిపించుకున్నాడు.

సాంకేతికవర్గం పనితీరు: కథ, కథనాలతో సంబంధం లేకుండా క్వాలిటీ సినిమా అందించడం కోసం తపించిన ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ ను ముందుగా మెచ్చుకోవాలి. ముఖ్యంగా క్వారీలో వేసిన గుడి సెట్ చాలా సహజంగా ఉంది. జి.వి.ప్రకాష్ పాటలు సోసోగా ఉన్నాయి. నేపధ్య సంగీతం కొన్ని చోట్ల సింక్ అవ్వలేదు. దూడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం బాగుంది. యాక్షన్ బ్లాక్స్ & ఎలివేషన్ సీన్స్ ను మాస్ ఆడియన్స్ ను మెప్పించే విధంగా తెరకెక్కించాడు. ఎడిటర్ పనితనం సినిమాకి మెయిన్ మైనస్ గా మారింది. సన్నివేశం నుంచి మరో సన్నివేశానికి షిఫ్ట్ అయ్యే విధానం బాలేదు. ఎడిట్ ప్యాటర్న్ ఎక్కడా కూడా నవీన్ నూలి చేశాడు అనిపించదు.

ఇక దర్శకుడు-రచయిత శ్రీకాంత్ ఎన్.రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. ఒక రచయితగా అత్యంత ఓల్డ్ టెంప్లేట్ స్టోరీతో ప్రేక్షకుల్ని అలరించలాని చేసిన ప్రయత్నం కాస్త బెడిసికొట్టిందనే చెప్పాలి. క్లైమాక్స్ లో క్వారీలోని రకరకాల మెషీన్ లతో విలన్లను చంపే విధానం ఆశ్చర్యపరిచినప్పటికీ.. సినిమాను ముగించిన విధానం మాత్రం షాక్ ఇస్తుంది. ఒక కమర్షియల్ దర్శకుడికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ శ్రీకాంత్ లో ఉన్నాయి. అయితే.. సరైన కథనం & ఎమోషనల్ కనెక్ట్ అనేది లేకపోతే.. ఎన్ని మాస్ ఎలివేషన్స్ ఇచ్చిన అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు అనే విషయాన్ని అతడు గ్రహించాలి.

విశ్లేషణ: నిర్మాత నాగవంశీ ప్రీరిలీజ్ ఈవెంట్లో చెప్పినట్లు.. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా, కథ-కథనాల గురించి ఆలోచించకుండా “ఆదికేశవ్” థియేటర్లకు వెళ్ళాలి.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus