సీనియర్ నటుడు నరేష్ అందరికీ సుపరిచితమే. చాలా మంచి నటుడు. ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించాడు.. అలరిస్తూనే ఉన్నాడు. అయితే ఇతని పెళ్లిళ్ల వ్యవహారం ఇతనికి ఓ బ్లాక్ మార్క్ లా మారింది. ఆల్రెడీ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మూడో భార్యకి విడాకులు ఇవ్వలేదు. ఆమెనే రమ్య రఘుపతి.. తన పిల్లాడి కోసం నరేష్ కు విడాకులు ఇచ్చేది లేదు అంటుంది. మరోపక్క నరేష్ – పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ వీడియో రిలీజ్ చేశారు.
అయితే అది సినిమా ప్రమోషన్ లో భాగంగా అనేది ఇన్సైడ్ టాక్. సరే ఏది ఏమైనా ఇది వారి పర్సనల్ వ్యవహారం. కానీ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మాత్రం వీరి పై ఎక్కువ ఫోకస్ పెట్టి అసభయకరమైన .. కామెంట్లు చేస్తున్నారు అంటూ నరేష్ తాజాగా పోలీసులను ఆశ్రయించారు. తనపై అలాగే పవిత్ర పై చాలా ఘోరమైన వార్తలు , కామెంట్లు చేస్తున్నారు అంటూ నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు గతంలో కూడా ఈ విషయం పై పవిత్ర ..
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కంప్లైంట్ గురించి దర్యాఫ్తు ఎంతవరకు వచ్చింది అనే విషయం పై కూడా పోలీసులను నరేష్ ఆరా తీసినట్టు తెలుస్తుంది. నరేష్ కు సహకరించిన పోలీసులు కొన్ని కీలక విషయాలు తెలిపినట్టు సమాచారం.