సీనియర్ నరేష్, పవిత్ర లోకేశ్ కాంబినేషన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీ కాంబినేషన్లలో ఒకటనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన మళ్లీ పెళ్లి మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. ఎం.ఎస్.రాజు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా మళ్లీ పెళ్లి ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నరేష్, పవిత్ర లోకేశ్ బయోపిక్ ఈ మూవీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మళ్లీ పెళ్లి మూవీ ఈవెంట్ లో భాగంగా పెళ్లి గురించి (Naresh) నరేష్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాహ వ్యవస్థ ప్రస్తుత పరిస్థితులలో కుప్పకూలిపోతుందని నరేష్ అన్నారు. ఫ్యామిలీ కోర్టుల సంఖ్య పెరగడం వెనుక అసలు రీజన్ ఇదేనని సీనియర్ నరేష్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. మళ్లీ పెళ్లి మూవీని వివాహ వ్యవస్థను గౌరవిస్తూ తెరకెక్కించామని సీనియర్ నరేష్ పేర్కొన్నారు.
మ్యారేజ్ అనేది రెండు మనసుల కలయిక అని ఆయన కామెంట్లు చేశారు. మనస్సులు కలిస్తే పెళ్లి జరిగినట్టేనని నరేష్ చెప్పుకొచ్చారు. మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ఒక కొత్త పాయింట్ ను చూపించబోతున్నామని నరేష్ కామెంట్లు చేశారు. ఆడియన్స్ ను తప్పుదోవ పట్టిస్తూ ప్రచారం చేస్తున్నామని చెప్పడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. ఈ మూవీ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఆయన అభిప్రాయపడ్డారు.
మళ్లీ పెళ్లి మూవీ థియేటర్ల దగ్గర బాగానే కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. మళ్లీ పెళ్లి సినిమాకు నరేష్ నిర్మాత కావడంతో ఈ సినిమా ఆయనకు ఆర్థికంగా లాభాలను తెచ్చిపెడుతుందో లేదో చూడాల్సి ఉంది. మళ్లీ పెళ్లి సినిమా గురించి ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.