బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పరిటాల నిరుపమ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈయనని నిరుపమ్ అంటూ సొంత పేరుతో పిలిస్తే బహుశా ఎవరూ గుర్తుపట్టలేరు కానీ డాక్టర్ బాబు అంటే మాత్రం టక్కున ఈయన అందరికీ గుర్తుకొస్తారు. ఇలా కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సీరియల్ పూర్తీ అయిన తర్వాత కూడా ఈయన ఇతర సీరియల్స్ లో నటిస్తున్న ఈయనని అందరూ డాక్టర్ బాబుగానే పిలుస్తున్నారు.
ఇలా డాక్టర్ బాబు పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నిరుపమ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇప్పటికి తాను ఎక్కడికి వెళ్లినా డాక్టర్ బాబు గానే పిలుస్తారని అలాగే నా భార్య అంటూ వంటలకు గురించి అడుగుతారు అంటూ తెలిపారు. ఆ సమయంలో నా భార్య మంజుల ఓ లుక్ ఇస్తుందని ఈయన తెలిపారు. ఇక కార్తీకదీపం రెండవ భాగం గురించి కూడా ప్రశ్నలు ఎదురుగా అన్ని కుదిరితే తప్పకుండా వస్తుందని చెప్పారు కానీ ఏ విషయం క్లారిటీ ఇవ్వలేదు.
ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మీ మొదటి రెమ్యూనరేషన్ ఎంత అని అడగడంతో ఈయన సమాధానం చెబుతూ తనకు మొట్టమొదటి రెమ్యూనరేషన్ గా వెయ్యి రూపాయలు ఇచ్చారని నిరుపమ్ వెల్లడించారు. ప్రస్తుత రెమ్యూనరేషన్ ఎంతనో తెలుసుకోవచ్చా అనడంతో అందుకు ఆయన ఓ చిన్న నవ్వు నవ్వేశారు. అయితే ఈయన ఇండస్ట్రీలో కేవలం సీరియల్స్ లో నటించడమే కాకుండా పలు సీరియల్స్ కి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే మీరు కాలేజీ టైంలో చేసిన కొన్ని అల్లరి పనులు గురించి చెప్పండి అనడంతో తాము ఒకసారి థియేటర్ కి వెళ్లినప్పుడు టికెట్లు దొరకక బ్లాక్ లో టికెట్స్ కొనుక్కున్నాము.
అవి తీసుకొని లోపలికి వెళ్ళగా ఎంట్రన్స్ వద్ద ఉన్నటువంటి వ్యక్తి ఇవి లాస్ట్ షో కి సంబంధించినవే అని చెప్పి మమ్మల్ని బయటకు పంపించారు.అయితే మేము వెనక్కి వస్తుండగా మా దగ్గరికి వేరే వాళ్ళు వచ్చి మాకు టికెట్స్ కావాలని అనడంతో మేము బ్లాక్ లో కొన్న టికెట్స్ వారికి మళ్ళీ బ్లాక్ లో అమ్మి అక్కడి నుంచి పక్క థియేటర్ కి వెళ్లి పోయాము అంటూ అప్పుడు చేసినటువంటి పనులను ఈ సందర్భంగా డాక్టర్ బాబు (Paritala Nirupam) గుర్తు చేసుకున్నారు.