పెళ్లి చూపులు చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు ప్రియదర్శి. ఆ చిత్రంలో కౌశిక్ పాత్రలో ఇతను జీవించాడనే చెప్పాలి. ఆ ఒక్క సినిమాతోనే ఇతను స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ 365 రోజులు బిజీగా ఉండే ఈ కమెడియన్ ఇటీవల జాతి రత్నాలు సినిమాతో మరింతగా ప్రేక్షకులకు చేరువయ్యాడు. కేవలం కమెడియన్ గానే కాకుండా మల్లేశం చిత్రంలో హీరోగా నటించి ఎలాంటి పాత్రనైనా ఓన్ చేసుకుని చెయ్యగలను అని చాటి చెప్పాడు.
ఇక ఇతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఇతని కెరీర్ సెట్ అయిన వెంటనే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ తో కూడా బిజీ అయిపోయాడు. అయితే ప్రియ దర్శి తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా సోషల్ మీడియాతో షేర్ చేసుకోడు అన్న సంగతి తెలిసిందే.2018 లోనే ఇతను రిచా శర్మ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక ప్రియదర్శి ఫ్యామిలీ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :