నాకు పెళ్లికి ముందు ఎఫైర్స్ ఉన్నాయి : రాజశేఖర్

  • November 13, 2017 / 04:08 PM IST

రెండేళ్ల గ్యాప్ తర్వాత డాక్టర్ రాజశేఖర్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ “పి.ఎస్.వి గరుడ వేగ 125.18” తో మనముందుకు వచ్చారు. అనేక ఏళ్ళ గ్యాప్ తర్వాత హిట్ అందుకున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రాజశేఖర్ కి మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆయన రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చారు. విలేకరులు అడిగిన అని ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పారు. గతంలో తారా చౌదరితో సంబంధాలున్నాయని రాజశేఖర్ పై రూమర్లు వచ్చాయి.. ఆ విషయం గురించి ప్రస్తావించగా..  అందుకు అతను మాట్లాడుతూ …” తారాచౌదరి నాతో ఒకసారి ఫోటో దిగింది.

అప్పుడే ఆమెను తొలిసారి చూశాను. అంతకన్నా ఆమెతో ఎటువంటి సంబంధం లేదు” అని స్పష్టం చేశారు. అలా అని తాను శ్రీరామ చంద్రుడిని మాత్రం కాదని వెల్లడించారు. పెళ్లికి ముందు  చాలా మందితో నే సంబంధాలు ఉన్నాయని, ప్రేమ పెళ్లి తర్వాత తరువాత కూడా కొందరితో సంబంధాలు కొనసాగించినట్లు నిజాయతీగా ఒప్పుకున్నారు. ఇలా రాజశేఖర్ బోల్డ్ గా మాట్లాడడంతో ప్రస్తుతం ఫిలిం నగర్లో ఇదే హాట్ టాపిక్ అయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus