సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ నటుడు కన్నుమూత..!

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు ఒకరి తర్వాత ఒకరు కన్నుమూస్తున్నారు. బీర్బల్‌ గా బాలీవుడ్ లో ప్రసిద్ధి చెందిన నటుడు, షోలే ఫేమ్ సతీందర్ కుమార్ ఖోస్లా మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో సీనియర్‌ నటుడు మరణించారు. చక్‌ దే ఇండియా ఫేమ్‌ రియో కపాడియా గురువారం ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన సన్నిహితులు తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం రియో వయసు 66 ఏళ్లు.

రియో కపాడియా దిల్ చాహ్తా హై, చక్ దే ఇండియా, మర్దానీ చిత్రాల్లో కనిపించారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు ముంబాయిలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కపాడియా బాలీవుడ్ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. షారుక్ ఖాన్ నటించిన చక్ దే ఇండియాలో చిత్రంలో కనిపించారు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ వంటి పలు హిట్‌ చిత్రాల్లో రియో కీలక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆయన చివరిసారిగా మేడ్ ఇన్ హెవెన్- 2 అనే వెబ్ సిరీస్‌లో కనిపించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ తండ్రిగా నటించారు. దాదాపు మూడు దశాబ్దాల తన కెరీర్‌లో కుటుంబం, జుద్వా రాజా, క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్స్‌లో నటించి మెప్పించారు. మహాభారతం సీరియల్‌లో గంధర్ రాజు పాత్రకు ప్రశంసలు అందుకున్నారు. రియో మృతి పట్ల సినీ ప్రియులు, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) సెలబ్రిటీలు సోషల్‌ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus