టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రస్తుతం విలన్ల కొరత వేధిస్తోంది. బలమైన ప్రతినాయకుల పాత్రల్లో నటించే విషయంలో చాలామంది విలన్లు తేలిపోతున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, జగపతి బాబు ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమాల్లో విలన్లుగా నటించడంతో టాలీవుడ్ దర్శకులు ఇతర ఇండస్ట్రీల విలన్లపై దృష్టి పెడుతున్నారు. అల వైకుంఠపురములో, క్రాక్ సినిమాలతో సముద్రఖని టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు రేంజ్ పెంచుకున్నారు. ప్రస్తుతం ఈ నటుడికి తెలుగులో ఊహించని స్థాయిలో డిమాండ్ ఉంది.
అయితే సముద్రఖని రోజుకు 7 లక్షల రూపాయల చొప్పున సినిమాలకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని సమచారం. తమిళంలో సముద్రఖనికి పెద్దగా క్రేజ్ లేదు. అయితే తెలుగులో మాత్రం ఈ నటుడికి ఊహించని స్థాయిలో డిమాండ్ ఉంది. మన నటులతో బేరాలు సాగిస్తున్న నిర్మాతలు సముద్రఖనికి మాత్రం అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది. తెలుగులో సక్సెస్ తో పాటు గుర్తింపు ఉండటం సముద్రఖనికి ప్లస్ అవుతోంది. సముద్రఖని తెలుగులో నటిస్తున్న సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే కావడంతో నిర్మాతలు కూడా ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు.
ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో పాటు శంకర్ చరణ్ కాంబో మూవీలో సముద్రఖని నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తమిళంలో సముద్రఖనికి డైరెక్టర్ గా కూడా గుర్తింపు ఉంది. అయితే కొంతమంది మాత్రం తెలుగులో టాలెంట్ ఉన్న ఎంతోమంది నటులు ఉన్నారని పరభాషా నటులకు ఎక్కువ మొతం రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాలలో తీసుకోవడానికి బదులుగా తెలుగు భాషా నటులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
హీరోల స్థాయిలో సముద్రఖని రెమ్యునరేషన్ తీసుకోవడం టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వైరల్ అవుతున్న రెమ్యునరేషన్ వార్తల గురించి సముదరఖని స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే సముద్రఖని రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సముద్రఖనికి తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉంది.