Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » ‘టెనెంట్’ కచ్చితంగా అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది : ‘సత్యం’ రాజేష్

‘టెనెంట్’ కచ్చితంగా అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది : ‘సత్యం’ రాజేష్

  • April 17, 2024 / 06:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘టెనెంట్’ కచ్చితంగా అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది : ‘సత్యం’ రాజేష్

‘పొలిమేర-2’తో ఊహించని సక్సెస్ అందుకున్న సత్యం రాజేష్ హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా చౌదరి, చందన పయ్యావుల, ఎస్తర్‌ నోరోన్హా, భరత్‌ కాంత్‌ కీలక పాత్రలు పోషించారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మోగుళ్ల చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొత్తగా పెళ్లైన జంట .. వేరు కాపురం .. అందమైన జీవితం. ఎన్నో ఆశలతో ఆ జంట కొత్తకాపురాన్ని మొదలుపెడుతుంది. ఆనందంగా .. అన్యోన్యంగా సాగిపోతున్న వారి జీవితంలోకి అతని వైపు నుంచి మరదలు .. ఆమె వైపు నుంచి ఒక ఫ్రెండ్ ఎంటరవుతారు. ఆ ఇద్దరితో పాటే ఈ దంపతుల మధ్య అపోహలు .. అపార్థాలు మొదలవుతాయి. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? వాళ్ల జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనేది కథ. ఒక వైపున క్రైమ్ .. మరోవైపున సస్పెన్స్ .. ఇంకోవైపున రొమాన్స్‌తో కూడిన ఈ సినిమాపై బజ్ పెరుగుతూ వచ్చింది. ఈ చిత్రానికి సాహిత్య సాగర్ అందించిన సంగీతం మరో ప్లస్ అయింది. సినిమా విడుదల దగ్గర పడడంతో జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్రయూనిట్. అందులో భాగంగా హీరో సత్యం రాజేష్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఆ విశేషాలు…

టెనెంట్ ఎవరు? ఎవరు ఎవరింటికి వస్తున్నారు? ఏంటి ఈ సినిమా కథ?
ఇది ఎదురింట్లో లేదా పక్కింట్లో జరిగే కథ. భార్యభార్తల మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చూపించే కథ. ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగే స్టోరీ. అన్నీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌లాగే ఉంటాయి. డైరెక్టర్ ఏం చెప్పారో అది పర్‌ఫెక్ట్‌గా తీశారు. ప్రతి సీన్ చాలా బాగుంటుంది. సినిమా థియేటర్‌లో చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పేలా ఉంటుంది. ఆడియన్స్‌కు ఈ సినిమా బ్యూటిఫుల్ ఫీల్ ఇస్తుంది.

టెనెంట్‌కు ‘A’ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు?
సినిమా ట్రైలర్‌లో మేడమీద నుంచి పడి చనిపోయే సీన్ ఉంది కదా.. అది సినిమాటిక్‌గా చూపిస్తే క్లీన్ సర్టిఫికెట్ వస్తుంది. కానీ రియాలిటీకి దగ్గరగా చూపిస్తేనే ఆడియన్స్‌కు ఒరిజినల్ ఫీల్ కలుగుతుంది. ఈ సీన్‌ను రియాలిటీకి దగ్గరగా చూపించడం వల్లే ‘A’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాలో చాలా లేయర్స్ ఉంటాయి.

మీరు ఇలాంటి సినిమాలనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు?
నేను మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు యాక్షన్, డ్యాన్స్‌లు, రొమాంటిక్, మాస్ ఎలిమెంట్స్, భారీ బడ్జెట్ లాంటి సినిమాలను ఎంచుకోను. నేను ఆర్టిస్ట్‌గా చేస్తూనే.. మంచి పాయింట్ ఉన్న సినిమాలు చేయాలనేది నా కోరిక. ఇప్పుడు ఎవరితోనే పోటీ పడాలనే కోరిక నాకు లేదు.

ట్రైలర్‌లో ఎడిటింగ్ కట్స్ చాలా బాగున్నాయి. సినిమాలో షార్ట్సే వాడారా? ట్రైలర్ కోసం సెపరేట్‌గా కట్ చేయించారా?
ఒక్క షాట్ కూడా ట్రైలర్ కోసం అని చేయలేదు. అన్నీ సినిమాలో షార్ట్సే వాడాము. డైరెక్టర్ యుగంధర్ గారు కథ చెప్పినప్పుడే నేను హ్యాపీ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నేను కథ వింటూనే ఉన్నా. ఇది భలే ఉందే అని ఫీలయిన కథ ఇది.

ఇది ఓటీటీ కోసం తీసిన కథ అని చెప్పారు. కానీ థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నారు. ‘పొలిమేర-2’తో సక్సెస్ రావడం వల్ల థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నారా?
కథ చాలా బాగుందని చిన్న సినిమాగా స్టార్ చేశాం. ఓటీటీ కోసమే అనుకుని చేస్తున్న క్రమంలో సినిమా అవుట్‌పుట్ చూసుకుంటే అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. అప్పుడు థియేటర్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. అందుకోసం ఇంకా ఇంప్రూవ్ చేశాం.

ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాలకు రైటింగ్ చాలా ముఖ్యం.. ఈ సినిమా రైటింగ్‌లో ఉన్న మ్యాజిక్ ఏంటి?
ఈ సినిమా కథను వర్మ శ్రీనివాస్ గారు రాశారు. ఆయన రైటింగ్ చాలా నేచురల్‌గా ఉంది. ఇందులో ఓవర్ డైలాగ్స్ ఉండవు. సినిమాలో నేను మాట్లాడేదే చాలా తక్కువ ఉంటుంది. సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది.

మీరు అన్నీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నారు కదా.. మీరు పర్టికులర్‌గా ఇలాంటివే సెలెక్ట్ చేసుకుంటున్నారా? లేక ఇలాంటి కథలే మీ దగ్గరికి వస్తున్నాయా?
నా దగ్గరకు వచ్చిన వాటిలో నేనే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేని సినిమాలు చేయడం వల్ల ఇండస్ట్రీలో పది కాలాలపాటు చల్లగా ఉంటాం. పోటీలో దిగి ఫైట్ చేసి ఓడిపోతే ఇంటికి వెళ్లిపోవాలి. మనం కుమ్మేస్తా.. కొట్టేస్తాం అని చెప్పే అలవాటు నాకు లేదు. నా జీవితం ఏంటో అందరూ చూసేశారు కదా. నాకు నప్పే సినిమాలనే నేను చేస్తా.

థ్రిల్లర్ సినిమాలకు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్.. పొలిమేర-2లో కూడా మ్యూజిక్ బాగా హైలైట్ అయింది. ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంటుంది?
ఈ సినిమాకు సాహిత్య సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు మ్యూజిక్కే ప్రాణం. క్లైమాక్స్‌లో డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేనే అలా అలా పాజ్ అయ్యా. ఒక ఆడియన్‌లాగా నాకే కన్నీళ్లు వచ్చాయి. సినిమాలో మ్యూజిక్ ఫీల్ అంతగా ఉంటుంది. సాహిత్య సాగర్‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి.

ఇకపై హీరోగానే చేస్తారా? ఆర్టిస్ట్‌గా కూడా కొనసాగుతారా?
నేను ఆర్టిస్టుగా చేస్తా.. ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చేస్తున్నా. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తే.. నాకు సూట్ అవుతాయనుకుంటేనే హీరోగా చేస్తా.

హీరో అంటే చాలామంది ఎలివేషన్స్ కోరుకుంటారు.. మీ సినిమాల్లో అలాంటివి లేవు. భవిష్యత్తులో ఏమైనా ఉంటాయా?
నాకు అలాంటి ఎలివేషన్స్ నచ్చవు. నేను మెయిన్ క్యారెక్టర్‌లో స్ట్రీట్ ఫైట్ అనే ఒక కామెడీ సినిమా చేస్తున్నా. అందులో ఎలివేషన్స్ ఉండవు కానీ.. కమర్షియల్ సినిమాలా ఉంటుంది.

మీ కెరీర్‌లో ‘క్షణం’ చెప్పుకోదగ్గ సినిమా కదా.. అలాంటి క్యారెక్టర్స్ మీ దగ్గరకు రాలేదా? వచ్చినా మీరు చేయలేదా?
క్షణం తర్వాత దగ్గర దగ్గర 50 సినిమాల్లో పోలీస్ రోల్స్ వచ్చాయి. కానీ మళ్లీ అలాంటి పాత్రలే చేస్తే బాగోదని చేయలేదు. కొన్ని పోలీస్ పాత్రలు కామెడీ చేసేలా ఉంటాయి. అలాంటివి చేయను. కొంచెం పవర్‌ఫుల్‌గా ఉంటే చేయొచ్చు. ప్రకాష్ రాజ్, రఘువరన్ లాంటి వాళ్లలాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనేది నా కోరిక.

టెనెంట్‌లో ట్విస్ట్‌లు, సస్పెన్స్ ఎంతవరకూ ఉంటాయి?
ఈ సినిమాలో ట్విస్ట్‌లు ఉండవు కానీ.. సస్పెన్స్ ఉంటుంది. మర్డర్ మిస్టరీ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్ చూసి ఆడియన్స్ సింపతీతో బయటకు వస్తారు.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు?
స్ట్రీట్ ఫైట్ అని నేను మెయిన్ లీడ్‌లో ఒక సినిమా చేస్తున్నా. మాస్ మహారాజా రవితేజ గారి మిస్టర్ బచ్చన్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నా. ఇంకా కొన్ని చర్చల దశలో ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Satyam Rajesh
  • #Tenant

Also Read

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

related news

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

trending news

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

54 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

3 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

20 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago

latest news

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

22 hours ago
Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

23 hours ago
OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

23 hours ago
Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

24 hours ago
Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version