ఈమధ్యకాలంలో తెలుగు పరిశ్రమకి దూరమైన సిద్ధార్థ్ ఒక ఏడాది క్రితం “గృహం”తో మంచి హిట్ అందుకున్నప్పటికీ ఆ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వకపోవడంతో.. మళ్ళీ కనిపించలేదు. మధ్యలో మలయాళంలో ఒక సినిమా చేశాడు, అది కూడా ఫ్లాప్ అయ్యింది. దాంతో మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నిశ్చయించుకొన్న సిద్ధార్థ్.. బా
యూనివర్సల్ అప్పీల్ ఉన్న అంధాధున్ ను సిద్ధార్థ్ రీమేక్ చేసి, దానికి న్యాయం చేస్తాడనే పూర్తి నమ్మకం ప్రేక్షకులకు ఉన్నప్పటికీ.. “నువ్వోస్తానంటే నేనోద్దంటానా, జీగార్తాండ” సినిమాల ప్రమోషన్ టైమ్ లో సిద్ధూ చెప్పిన మాటలే అందరికీ గుర్తొస్తున్నాయి. ఆ సమయంలో తాను రీమేక్ సినిమాలు చేయాలనుకోవడం లేదని, రీజనల్ కంటెంట్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడమే తన లక్ష్యమని చెప్పాడు సిద్ధూ. అయితే.. ఆమధ్య కన్నడ బ్లాక్ బస్టర్ లూసియాను తమిళంలో రీమేక్ చేశాడనుకోండి. కానీ.. ఇప్పుడు సినిమాల్లేకపోవడంతో తాను అన్న మాటను మరిచి ఇలా బాలీవుడ్ రీమేక్ కు రెడీ అవుతుండడం మాత్రం చర్చనీయాంశం అయ్యింది. కానీ.. సిద్ధార్థ్ ఫ్యాన్స్ మాత్రం మనోడు తీసుకొన్న నిర్ణయానికి తెగ ఉప్పొంగిపోతున్నారు.