తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు “శింబు”. ఒక స్టార్ హీరో కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శింబు అనతికాలంలోనే తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకొన్నాడు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా స్టార్ హీరోయిన్స్ తో నడిపిన ప్రేమాయణాల పుణ్యమా అని ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచాడు. కొన్నాళ్ళపాటు మనోడ్ని ఏకంగా ఇండస్ట్రీ నుంచి వెలివేయడానికి కూడా ఇండస్ట్రీ పెద్దలు వెనుకాడలేదు. తొలుత నయనతార, అనంతరం హన్సిక, ఆ తర్వాత సనా ఖాన్ ఇలా చాలామందితో బాబు నడిపిన ప్రేమాయణాలు చూసినవాళ్లు మనోడు ఇంక పెళ్లి చేసుకోడేమో అనుకున్నారు.
కానీ.. అకస్మాత్తుగా శింబు పెళ్లి ఇప్పుడు వార్తల్లో విషయంగా నిలిచింది. అయితే మనోడు పెళ్లి చేసుకొనేది ఇండస్ట్రీలో అమ్మాయిని కాదండోయ్.. వాళ్ళ రిలేటివ్స్ అమ్మాయిని. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో సంబంధం ఒకే అయిపోయిందట. ఇంతకీ ఆ అదృష్టవంతురాలు ఎవరా అని అందరూ ఎదురుచూస్తున్నారు. మరి ఆ అమ్మాయిని ఎప్పుడు రివీల్ చేస్తారో ఏమో.