తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటిస్తే ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు శివాజీ ఒకరు. ఈయన కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తన మార్కు చూపించారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఈయన సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి శివాజీ ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.
ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టగానే చాలామంది ఈయనే విన్నర్ అవుతారు అంటూ భావించారు కానీ చివరి వారాలలో ఈయన ఆట తీరు కారణంగా టైటిల్ రేసు నుంచి తప్పుకున్నారు. ఇలా బిగ్ బాస్ పూర్తి అయిన తర్వాత శివాజీ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇలా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి ఈయన బిగ్ బాస్ కి సంబంధించి ఎన్నో విషయాలను వెల్లడించారు. అదేవిధంగా బిగ్ బాస్ నిర్వాహకులు కావాలని నన్ను నెగిటివ్ గానే చూపించారని ఈయన ఆరోపణలు కూడా చేశారు.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన రెండో భార్య ఉందంటూ తన సెకండ్ వైఫ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు శివాజీకి మరో భార్య ఉంది అనే విషయం ఇప్పటివరకు ఎవరికీ ఎక్కడ తెలియదు మరి నిజంగానే ఈయనకు రెండో భార్య ఉందా ఉంటే ఎవరు అనే విషయానికి వస్తే ఈయనకు రెండో భార్య ఉంది అనుకుంటే మనం నిజంగానే ఒక అమ్మాయి అనుకుంటే పొరపాటు పడినట్లే ఈయనకి కాఫీ అంటే ఎంతో ఇష్టం.
కాఫీని తనకు రెండోవైపుగా భావిస్తూ ఉంటారు. బిగ్ బాస్ హౌస్లో కూడా కాఫీ కోసం బిగ్ బాస్ తో పెద్ద ఎత్తున గొడవ పడిన సంగతి తెలిసిందే. కాఫీ అంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి ఈయన కాఫీని తన రెండో భార్యగా భావిస్తూ ఉంటారు అంటూ ఈ సందర్భంగా శివాజీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.