ఘనంగా నితిన్ విలన్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

వేసవి సీజన్ వచ్చేస్తుంది.పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలవుతుంది.పెళ్లీడుకొచ్చిన సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయ్యారు… అవుతున్నారు కూడా..! ఇటీవల దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకు అయిన ఆశిష్ పెళ్లి జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. సినిమా వాళ్ళ పెళ్లిళ్లు అంటే ఎలా ఉంటాయి అనేది కూడా అందరికీ తెలిసిందే. వేలల్లో బంధుమిత్రుల సంఖ్య,భోజనాల్లో బోలెడు ఐటమ్స్, అబ్బో మాములుగా ఉండదు విషయం.

కానీ ఓ నటుడు మాత్రం ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్ గా గుడిలో పెళ్లి చేసుకుని షాకిచ్చాడు. అతను తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో ఓ క్రేజీ హీరో సినిమాలో విలన్ గా నటించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మలయాళ నటుడు సుదేవ్ నాయర్ అందరికీ సుపరిచితమే. 2023 చివర్లో వచ్చిన రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో ఓ విలన్ గా నటించాడు.అలాగే నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమాలో మెయిన్ విలన్ గా కూడా నటించాడు.

తాజాగా ఇతను పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చాడు. తాను (Sudev Nair) ప్రేమించిన అమ్మాయిని సింపుల్ గా ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా నటే. ఆమె పేరు అమర్ దీప్ కౌర్. కొన్నాళ్లుగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు. మొత్తానికి వీళ్ళు తాజాగా కేరళ సాంప్రదాయంలో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus