Bhamakalapam 2 Review in Telugu: భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • NA (Hero)
  • ప్రియమణి (Heroine)
  • రణ్య ప్రదీప్, సీరత్ కపూర్, చైతు జొన్నలగడ్డ, సందీప్ వేద్, అనీష్ గుర్వారా, రఘు ముఖర్జీ (Cast)
  • అభిమన్యు తడిమేటి (Director)
  • భోగవల్లి బాపినీడు, సుధీర్ ఈదర (Producer)
  • ప్రశాంత్ ఆర్ విహారి (Music)
  • దీపక్ యరగేర (Cinematography)
  • Release Date : ఫిబ్రవరి 16, 2024

ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన భామాకలాపం చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీ వేదికగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండీ మంచి స్పందన లభించింది. ఇక ఆ చిత్రానికి కొనసాగింపుగా భామాకలాపం2 రూపొందింది. మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడంతో రెండో భాగం పై మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ‘పొలిమేర 2’ ..లా థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. అందుకే రెండో భాగాన్ని కూడా ఆహా వేదికగా రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఒకసారి చూద్దాం రండి:

కథ : యూట్యూబ్ చానెల్ లో వంటల వీడియోలు చేసుకునే అనుపమ( ప్రియమణి) కుటుంబం రూ.200 కోట్ల విలువైన కోడిగుడ్డు వల్ల కష్టాల పాలవ్వడం, ఆ కష్టాల నుండీ ఆమె కుటుంబం ఎలా బయటపడింది అనే పాయింట్ తో మొదటి భాగం రూపొందింది. ఇక రెండో భాగం కథ అక్కడి నుండే మొదలవుతుంది. పక్క వాళ్ల విషయాల్లో దూరకూడదు అనే ఉద్దేశంతో అనుపమ భర్త ఆమె నుండి మాట తీసుకుంటాడు.

దీంతో అనుపమ తన యూట్యూబ్ చానెల్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఒక హోటల్ పెట్టుకోవాలి అని భావిస్తుంది. తన పనిమనిషి శిల్పని( శరణ్య ప్రదీప్) అసిస్టెంట్ గా పెట్టుకుంటుంది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైమ్ లో ఈమెకు మళ్ళీ ఒక కష్టం వస్తుంది. అందువల్ల ఈమె ఫ్యామిలీ మళ్ళీ కష్టాల్లో పడుతుంది. ఆమె ఫ్యామిలీ ఎందుకు కష్టాల్లో పడింది? ఆమె ఫ్యామిలీని టార్గెట్ చేసింది ఎవరు? అనేది మిగిలిన కథ.

నటీనటులు పనితీరు: మొదటి భాగంలో ప్రియమణి ఎంత బాగా నటించింది అనేది చూశాం. ఈ సినిమాలో కూడా అంతే ఉత్సాహంతో ఆమె నటించింది. ముఖ్యంగా శరణ్యతో కలిసి చేసిన కామిడీ సీన్స్ హైలెట్ అని చెప్పాలి. శరణ్య సినిమా సినిమాకి తన వైవిధ్యాన్ని చూపిస్తున్న సంగతి తెలిసిందే. మొన్ననే అంబాజీపేట మ్యారేజీ బ్యాండు లో ఒక సీరియస్ రోల్ చేసింది. కొన్ని చోట్ల కన్నీళ్లు కూడా పెట్టించింది.అయితే భామాకలాపం 2 లో ఆమె తన నటనతో బాగా నవ్వించింది. ఇక శీరత్ కపూర్ గ్లామర్ తో సినిమాకి కలర్ ఫుల్ లుక్ తీసుకొచ్చారు అని చెప్పాలి.

ఆమె రోల్ గురించి ఎక్కువగా చెబితే సినిమా మూడ్ ని దెబ్బ తీసినట్టు కూడా అవుతుంది. ఇక లోబో, తాషీర్ , సదానందం, వంటి వారు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. బ్రహ్మాజీ అతిధి పాత్రలో కనిపించినా మంచి మార్కులు వేయించుకున్నాడు అని చెప్పాలి.

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు అభిమన్యు భామాకలాపం ని మించి ఉండాలనే ఉద్దేశంతో భామాకలాపం2 ని తీశాడు. ప్రతి సన్నివేశం అతని ఇంటెన్షన్ ఏంటి అనేది తెలియజేసేలా ఉన్నాయి. కానీ ఆ రేంజిలో భామాకలాపం2 లేదు కానీ పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇబ్బంది పెట్టకుండా ఈ మూవీ ఉంది. ఓటీటీ కదా అని దర్శకుడు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు పట్టలేదు.

కామిడీ కోసం రాసుకున్న డైలాగ్స్ కూడా శృతిమించలేదు. దీపక్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి రిచ్ లుక్ తీసుకొచ్చాయి. ప్రశాంత్ విహారీ సంగీతం కూడా ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ కి కూడా పేరు పెట్టనవసరం లేదు.

విశ్లేషణ: ప్రియమణి నటన, సెకండ్ హాఫ్ కోసం భామాకలాపం2 (Bhamakalapam 2) ని కచ్చితంగా ఒకసారి చూడొచ్చు. భామాకలాపం మొదటి భాగంతో పోలికలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. మొదటి భాగం చూడకపోయినా అందరికీ అర్ధమయ్యే విధంగానే భామాకలాపం2 ఉంది.

రేటింగ్: 2.5/5

Click Here to Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus