Suman: డైలాగ్స్ చెప్పడంలో తారక్ మాస్టర్.. సుమన్ చెప్పిన విషయాలివే!

సీనియర్ హీరో సుమన్ (Suman) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవర   (Devara) సినిమా ఓవర్సీస్ లో, బుక్ మై షోలో సంచలన రికార్డులను సొంతం చేసుకుంటుండగా ఈ సినిమా గురించి, తారక్  (Jr NTR)  గురించి సుమన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఎంతో లక్కీ అని రిలీజ్ కు ముందు ఇన్ని రికార్డులు సాధించడం మామూలు విషయం కాదని తెలిపారు. ఈ విధంగా రికార్డ్స్ క్రియేట్ చేయడం అందరు నటులకు సాధ్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు.

Suman

తారక్ చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్సర్ అని డ్యాన్స్ లో తారక్ మాస్టర్ అని సుమన్ తెలిపారు. ఫైట్స్ గురించి కూడా తారక్ కు అవగాహన ఉందని సుమన్ వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ నిబద్ధత, అంకిత భావం ఉన్న వ్యక్తి అని ఆయన తెలిపారు. తారక్ అందరితో స్నేహపూర్వకంగా ఉంటారని సుమన్ అన్నారు. తారక్ ప్రతి సీన్ ను టీమ్ తో చర్చిస్తారని సలహాలను, సూచనలను ఇస్తారని తారక్ తో కలిసి మరోసారి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని సుమన్ తెలిపారు.

దమ్ము (Dammu) సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి పాత్రలో సుమన్ నటించిన సంగతి విదితమే. అయితే ఈ సినిమా భారీ సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. దేవర సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఇది మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని సుమన్ తెలిపారు. బుక్ మై షో వెబ్ సైట్ లో ఏకంగా 3 లక్షల 36 వేల మంది దేవర సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు.

పుష్ప ది రూల్ (Pushpa 2) సినిమా కోసం 3 లక్షల 34 వేల మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. దేవర సినిమా విడుదలకు 10 రోజుల సమయం మాత్రమే ఉండగా ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

చర్మం కమిలే ఎండలో సైతం షూట్ లో పాల్గొన్న చిరు.. ఎవరూ చేయలేరంటూ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus