JD Chakravarthy: చర్మం కమిలే ఎండలో సైతం షూట్ లో పాల్గొన్న చిరు.. ఎవరూ చేయలేరంటూ?

మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. చిరంజీవి సినిమాల కోసం ఎంతలా కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. చిరంజీవి పారితోషికం పరంగా కూడా ఒకింత టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. భోళా శంకర్ తో (Bhola Shankar) నిరాశ పరిచిన చిరంజీవి విశ్వంభరతో (Vishwambhara) మ్యాజిక్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

JD Chakravarthy

ప్రముఖ టాలీవుడ్ నటుడు జేడీ చక్రవర్తి (JD Chakravarthy) చిరంజీవి గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. చిరంజీవి పని రాక్షసుడు అని జేడీ చక్రవర్తి పేర్కొన్నారు. చిరంజీవి గారు దుర్మార్గుడు అంటూ ఆయన ఎంత కష్టపడతారో జేడీ చక్రవర్తి తెలిపారు. ఘరానా మొగుడు (Gharana Mogudu) మూవీ షూట్ సమయంలో చిరంజీవి గారు షాట్ పూర్తైన తర్వాత కారులో పడుకునే వారని జేడీ చక్రవర్తి తెలిపారు.

మేకప్ రూప్ లో విశ్రాంతి తీసుకుంటే యూనిట్ పిలవదని అందుకే ఇక్కడ పడుకున్నానని చిరంజీవి చెప్పారని జేడీ తెలిపారు. డైరెక్టర్ షాట్ రెడీ అని చెబితే నేను వినగలను కాబట్టి వెంటనే వెళ్లగలనని చిరంజీవి చెప్పారని జేడీ చక్రవర్తి వెల్లడించారు. వర్క్ అంటే చిరంజీవికి ఎంత అంకిత భావం ఉందో జేడీ చక్రవర్తి కామెంట్ల ద్వారా సులువుగానే అర్థమవుతోంది. జ్వాల షూట్ సమయంలో చర్మం కమిలే ఎండ ఉన్నా చిరంజీవి షూట్ లో పాల్గొన్నారని జేడీ అన్నారు.

సాధారణంగా స్టార్ హీరోలు అంత రిస్క్ తీసుకోరు. అయితే చిరంజీవి మాత్రం ఈ విషయంలో భిన్నమని చెప్పవచ్చు. వర్క్ విషయంలో ఇలా ఉండే హీరోలు చాలా తక్కువమంది ఉంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 60 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్న చిరంజీవి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

 ఆ ఐదు సినిమాలతో చరిత్ర సృష్టించిన ప్రభాస్.. అసలేమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus