Siddharth, Aditi Rao Hydari: వైరల్ అవుతున్న సిద్దార్థ్ అదితిరావుల పెళ్లి ఫోటోలు!

టాలీవుడ్ లో సెటిల్ అయ్యే రేంజ్ లో పేరు తెచ్చుకున్న తమిళ హీరో సిద్ధార్థ్ (Siddharth)  ,బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా డెబ్యూ చేసి సౌత్ లో హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయిన అదితిరావులు (Aditi Rao Hydari) గత కొంతకాలంగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన డ్యాన్స్ రీల్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పటినుండి వారి పెళ్లి ఎప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Siddharth, Aditi Rao Hydari

మొన్నామధ్య పెళ్లి అయిపోయింది అనే వార్తలు వచ్చినప్పటికీ.. అది కేవలం ఎంగేజ్మెంట్ అని కన్ఫర్మ్ చేసారు సిద్ధార్థ్-అదితి. అయితే.. ఎట్టకేలకు వారి పెళ్లిని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది ఈ జంట. వనపర్తిలోని శ్రీరంగాపురం రంగనాయకస్వామి ఆలయంలో వీరి పెళ్లి కుటుంబ సభ్యుల నడుమ ఘనంగా జరిగింది. ఈ మేరకు కొన్ని ఫోటోలు విడుదల చేసారు. అదితిరావు హైదరీ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే.. ఈ ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం విశేషం. సిద్ధార్థ్ 2003లో మేఘన అనే చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం 2007లో విడాకులు తీసుకున్నారు. అదితిరావు హైదరీ కూడా 2002లో సత్యదీప్ మిశ్రా అనే నటుడిని పెళ్లి చేసుకొని.. 2013లో విడాకులు తీసుకొని వేరు పడింది. సిద్ధార్థ్ & అదితిరావు హైదరీ జంట ఎప్పట్నుంచో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పుడు ఈ పెళ్లితో వారు మరోసారి వార్తల్లోకెక్కారు.

అయితే.. ఈ పెళ్లి ఎప్పడు జరిగింది? మార్చి 28న ఎంగేజ్మెంట్ అంటూ వచ్చినప్పుడే అదే వనపర్తిలో పెళ్లయిపోయిందా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. మరి అప్పుడు ఎందుకు దాచారు అనే విషయం పక్కన పెడితే.. కొత్త జీవితం ఆరంభిస్తున్న/ఆరంభించేసిన సిద్ధార్థ్-అదితిరావు జంటకు “ఫిల్మ్ ఫోకస్” అభినందనలు తెలియజేస్తుంది!

 ‘బొబ్బిలి రాజా’ కి 34 ఏళ్ళు.. రానా ఫోకస్ చేయట్లేదా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus