ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో తమిళంలో తెరకెక్కిన “తిరుచిత్రాంబలం” చిత్రం నుండి “మేఘం కరుకాత” పాట కొరియోగ్రఫీకి గాను ఉత్తమ కొరియోగ్రఫీ కేటగిరీలో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న జానీ మాస్టర్ (Jani Master) పై ఇవాళ పలు లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. జానీ మాస్టర్ తో కలిసి పని చేస్తున్న 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్, అతడిపై పలు కేసులు నమోదు చేసింది.
విషయం ఏంటంటే.. ఆ లేడీ కొరియోగ్రాఫర్ మేరకు జానీ మాస్టర్ ఆమెపై పలుమార్లు లైంగికంగా దాడి చేసాడని. చెన్నై, ముంబై, హైద్రాబాద్ వంటి నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్లినప్పుడల్లా ఆమెను వేధించేవాడని, ఆఖరికి హైద్రాబాద్ లోని నార్సింగిలోని తన ఇంట్లో కూడా లైంగికంగా వేధించాడని సదరు లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.
మాములుగా అయితే.. ఈ విషయం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయ్యేది. కానీ, జానీ మాస్టర్ (jani Master) జనసేన పార్టీకి ప్రచార కర్తగా వ్యవహరించి ఉండడం, పవన్ కల్యాణ్ తో క్లోజ్ గా ఉండడంతో ఇప్పుడు ఈ విషయం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ శ్రేణులు జానీ మాస్టర్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇక సోషల్ మీడియాలో జానీ మాస్టర్ పై ఒక్కసారిగా హేట్ పెరిగిపోయింది.
ఇకపోతే.. నర్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ ను ఇంకా జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకోవాల్సి ఉండగా, జానీ మాస్టర్ పై ఇదివరకు కూడా 2015లో కాలేజీ అమ్మాయిపై దాడి, ఇటీవల ఓ యువ కొరియోగ్రాఫర్ కు ఛాన్సులు రాకుండా చేస్తున్నాడంటూ రచ్చకెక్కాడు. మరి జానీ మాస్టర్ పై కేస్ వేసిన ఈ 21 ఏళ్ల మహిళా క్రొయోగ్రాఫర్ ఎవరు? అతనిపై నమోదైన ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) మరియు స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) మరియు (ఎన్) వంటి సీరియస్ ఎలిగేషన్స్ నుండి జానీ మాస్టర్ ఎలా బయటపడతాడు అనేది వేచి చూడాలి!