Sumanth: ఏపీ సీఎంపై సుమంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Advertisement

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టాలీవుడ్ హీరో సుమంత్ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. సుమంత్ నటించిన మళ్లీ మొదలైంది సినిమా ఈ నెల 11వ తేదీన జీ5 యాప్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమంత్ మీడియాతో ముచ్చటిస్తూ ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. మళ్లీ మొదలైంది సినిమా విడాకుల కాన్సెప్ట్ తో తెరకెక్కగా వర్షిణి, నైనా గంగూలీ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

Click Here To Watch

తాను చదువుకునే రోజుల నుంచి జగన్ తో పరిచయం ఉందని అప్పుడు జగన్ తనతో ఏ విధంగా ఉన్నాడో ప్రస్తుతం ఏపీ సీఎం అయినా అదే విధంగా ఉన్నాడని సుమంత్ కామెంట్లు చేశారు. చదువుకునే సమయంలో జగన్ పాలిటిక్స్ లో మంచి స్టేజ్ కు వస్తాడని తాను భావించానని జగన్ విషయంలో తన కాన్ఫిడెన్స్ నిజమైందని సుమంత్ పేర్కొన్నారు. ఈరోజు జగన్ సీఎం అయ్యాడని తన ఊహలను జగన్ నిజం చేశాడని సుమంత్ తెలిపారు.

మరోవైపు విడాకుల గురించి కూడా ఈ హీరో స్పందించాడు. కీర్తి రెడ్డితో విడిపోయిన ఈ హీరో ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తనకు తెలిసిన చాలామంది డైవోర్స్ తీసుకున్నారని డైవోర్స్ అనేది ఇప్పుడు కామన్ అయిందని సుమంత్ చెప్పుకొచ్చారు. తన ఫ్యామిలీలో కూడా విడాకులు ఉన్నాయని సుమంత్ కామెంట్లు చేశారు. విడాకుల విషయంలో తాను దురదృష్టం అనే పదం కూడా వాడనని అలా జరుగుతున్నాయని సుమంత్ తెలిపారు.

రెండో పెళ్లి విషయంలో కొన్ని కష్టాలు ఉన్నా చాలామంది అడ్జెస్ట్ అయిపోతున్నారని సుమంత్ చెప్పుకొచ్చారు. రెండో పెళ్లిని ఎలాగోలా కొనసాగించాలని చాలామంది అనుకుంటున్నారని రెండో పెళ్లి కూడా ఫెయిల్ అయితే ముద్ర పడుతుందని చాలామంది భావిస్తున్నారని సుమంత్ వెల్లడించారు. సుమంత్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus