తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

తెలుగులో ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒకప్పుడు తెలుగు సినిమా మార్కెట్ రూ.80 కోట్లు మాత్రమే ఉండేది. రాజమౌళి పుణ్యమా అని అది ఇప్పుడు రూ.200 కోట్లకి చేరుకుంది. ఒకప్పుడు అయితే బాలీవుడ్ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీ మర్కెటే పెద్దది. కానీ ఆ తర్వాత ఈ రెండిటినీ మించి టాలీవుడ్ స్థాయి పెరిగింది. ఈ రెండు ఇండస్ట్రీ జనాలకి టాలీవుడ్ అంటే చిన్న చూపు.మన సూపర్ హిట్ సినిమాలకు వాళ్ళు ఎన్నో వంకలు పెట్టేవారు.మన తెలుగు వాళ్ళు మాత్రం భాషతో సంబంధం లేకుండా నచ్చితే ఏ సినిమాని అయినా ఆదరిస్తారు.అక్కడి.. హీరోలకి కూడా ఇక్కడ మంచి మార్కెట్ ను కట్టబెట్టారు.మన హీరోల సినిమాలకు మాత్రం అక్కడ ఆదరణ ఉండేది కాదు. అయితే కొన్నాళ్లుగా మన టాలీవుడ్ సినిమాలు కోలీవుడ్ లో కూడా సత్తా చాటుతున్నాయి. అక్కడ కూడా మన సినిమాలు మంచి కలెక్షన్లు రాబడుతున్నాయి. మరి కోలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు(గ్రాస్) రాబట్టిన తెలుగు సినిమాలు ఓ లుక్కేయండి :

  1. బాహుబలి 2 :

ఈ చిత్రం తమిళ్ లో ఏకంగా రూ.151.7 కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టింది.

2) బాహుబలి :

ఈ చిత్రం తమిళ్ లో రూ.75 కోట్ల గ్రాస్ ను రాబట్టింది

3) పుష్ప ది రైజ్ :

ఈ చిత్రం తమిళ్ లో రూ.29.7 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

4) ఊపిరి :

\

తమిళ్ లో ఈ చిత్రం రూ.26.8 కోట్ల గ్రాస్ ను రాబట్టింది

5) స్పైడర్ :

ఈ చిత్రం తమిళ్ లో రూ.23.6 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

6) ఈగ :

ఈ చిత్రం తమిళ్ లో రూ.24.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

7) మగధీర :

ఈ చిత్రం తమిళ్ లో రూ.18.2 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది

8) సాహో :

తమిళ్ లో ఈ చిత్రం రూ.10.6 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

9) అరుంధతి :

తమిళ్ లో ఈ చిత్రం రూ.10.4 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

10) శ్రీమంతుడు :

ఈ చిత్రం తమిళ్ లో రూ. 6 5 కోట్ల వరకు గ్రాస్ వసూళ్ళను రాబట్టింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus