Brahmanandam: బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!

ఈరోజు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారి పుట్టినరోజు. ఈరోజుతో ఆయన 66 సంవత్సరాలు పూర్తిచేసుకుని 67వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. దాంతో సోషల్ మీడియాలో ఆయనకి సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ చెబుతూ ఆయన పేరుతో ఉన్న హ్యష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడంటే ఆయన ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు. హెల్త్ విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉండడంతో ఆయన ఆచి తూచి సినిమాల్లో నటిస్తున్నారు. గతేడాది ‘జాతి రత్నాలు’ సినిమాలో ఆయన కనిపించారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం బ్రహ్మానందం అందరినీ పలకరిస్తూనే ఉంటారు.

మీమ్స్ రూపంలో బ్రహ్మానందం గారు అందరినీ అలరిస్తూనే ఉన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పినట్టు.. ఓ 10 జెనరేషన్స్ వరకు మీమ్స్ చేసుకోవడానికి కావాల్సినంత స్టఫ్ ఆయన ఇచ్చేసారు. కామెడీ అంటే మనకి మొదట గుర్తుకొచ్చేది బ్రహ్మానందంగారే అనే స్థాయిలో ఆయన ఎదిగారు. ఇదిలా ఉండగా.. గతంలో బ్రహ్మానందం గారి కామెడీ హైలెట్ అవ్వడం వలన హిట్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవి హిట్ అవ్వడం వలన అప్పటివరకు ప్లాపులతో సతమతమవుతున్న హీరోలు హిట్లు కొట్టి ఊపిరి పీల్చుకున్నారు. ఆ హీరోలు ఎవరో.. బ్రహ్మానందం కామెడీ వలన హిట్ అయిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఢీ :

మంచు విష్ణుకి మొదటి హిట్ మూవీ ఇది. శ్రీను వైట్ల దర్శకుడు. ఈ మూవీలో బ్రహ్మానందం కామెడీ ఓ రేంజ్లో పండింది. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.

2) కృష్ణ :

రవితేజ- వి.వి.వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీలో బ్రహ్మానందం గారి కామెడీ చాలా హైలెట్ అయ్యింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ మూవీకి ముందు రవితేజ చేసిన సినిమా ‘దుబాయ్ శీను’ కూడా బాగానే హిట్ అయ్యింది. అందులో కూడా బ్రహ్మీ కామెడీనే హైలెట్.

3) జల్సా :

పవన్ కళ్యాణ్ ప్లాపుల నుండీ బయటపడిన మూవీ ఇది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బ్రహ్మానందం కామెడీ హైలెట్ గా నిలిచింది.

4) రెడీ :

రామ్ నటించిన ‘జగడం’ ప్లాప్ అయ్యింది. తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘రెడీ’ మూవీలో బ్రహ్మీ కామెడీనే హైలెట్.

5) అదుర్స్ :

‘కంత్రి’ తో ప్లాప్ ను మూటకట్టుకున్న బ్రహ్మీ ‘అదుర్స్’ తో హిట్టు కొట్టాడు. ఈ మూవీలో బట్టు పాత్రలో బ్రహ్మీ చేసిన కామెడీ హైలెట్ అయ్యింది. చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించింది.

6) దూకుడు :

ఈ మూవీకి ముందు మహేష్ బాబు సినిమాలు ప్లాపులు అయ్యాయి. శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీలో బ్రహ్మానందం కామెడీ హైలెట్ గా నిలిచింది. హౌస్ ఫుల్ కలెక్షన్లతో రికార్డుల మోత మోగించేలా చేసింది.

7) దేనికైనా రెడీ :

విష్ణు రెండో హిట్టు కొట్టిన మూవీ ఇది. ఇందులో కూడా బ్రహ్మానందం కామెడీనే హైలెట్ గా నిలిచింది.

8) నాయక్ :

ఈ మూవీలో బ్రహ్మీ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. జయప్రకాశ్ రెడ్డితో కలిసి బ్రహ్మీ చేసిన కామెడీని ఇప్పటికి యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. ‘మగధీర’ తర్వాత చరణ్ కు కావాల్సిన విజయాన్ని అందించింది ఈ చిత్రం.

9) బాద్ షా :

‘శక్తి’ ‘ఊసరవెల్లి’ ‘దమ్ము’ వంటి చిత్రాలతో బ్యాడ్ ఫామ్లో ఉన్న ఎన్టీఆర్ కు మంచి విజయాన్ని అందించింది ‘బాద్ షా’. ఈ మూవీలో బ్రహ్మానందం కామెడీ పీక్స్ లో ఉంటుంది.

10) లౌక్యం :

గోపీచంద్ ఆ టైంకి ప్లాపుల్లో ఉన్నాడు. శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ ‘లౌక్యం’ తోనే కోలుకున్నాడు. ఈ మూవీలో కూడా బ్రహ్మీ కామెడీ సూపర్.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus