అక్కినేని కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు కూతురు, నాగార్జున సోదరి అయిన నాగసుశీల భర్త అనుమోలు సత్యభూషణ్‌రావు (70) జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి 11.40 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సత్యభూషణ్‌రావు, నాగసుశీలకు ముగ్గురు సంతానం. సంగీత, లక్ష్మి సాహిత్య, సుశాంత్. కాళిదాసు, కరెంట్, అడ్డా వంటి సినిమా ద్వారా తెలుగు ప్రజలకు సుశాంత్ బాగా పరిచయం.
సత్యభూషణ్‌రావు మరణంతో వారింటితో పాటు అక్కినేని ఇంట కూడా విషాదం నెలకొని ఉంది. నాగార్జున తనయుడు నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన “రారండోయ్ వేడుక చూద్దాం” ఆడియో రిలీజ్ వేడుక ఈరోజు జరగాలి. ఈ ఘటనతో ఆడియో రిలీజ్ వేడుకను రద్దు చేశారు. సుశాంత్ కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు బంధు మిత్రులు, సినీ స్టార్లు తరలి వస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.