ఇటీవల టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.కొన్నాళ్ళుగా క్యాన్సర్తో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె ఇటీవల ప్రాణం విడిచింది. దాంతో ఉత్తేజ్ మరియు అతని కుటుంబ సభ్యులు కృంగిపోయారు. చిరంజీవి వంటి స్టార్ హీరోలు అతన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు అతను ఎలా ఏడ్చాడో… పలు ఫోటోలు, వీడియోల ద్వారా చూసాం. ఉత్తేజ్ కు యాక్టింగ్ స్కూల్ కి సంబంధించిన పనులన్నిటినీ ఆమెనే చక్క బెట్టేది.
ఆమె లేకపోవడంతో ఉత్తేజ్ ఫ్యామిలీలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. అయితే పద్మిని గారు మళ్ళీ జన్మించబోతున్నారట. అదెలా అనుకుంటున్నారా? ఉత్తేజ్ కూతురు చేతన ప్రస్తుతం నిండు గర్భిణి. ఆమె బేబీ బంప్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలని తన ఇన్స్టాలో షేర్ చేసిన చేతన.. ‘కూతురు పుడితే మా అమ్మ మళ్లీ పుట్టింది అని సంతోషిస్తాను, కొడుకు పుట్టినా ఆనందమే’ అంటూ పేర్కొంది.
ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన చేతన హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చి ఓ సినిమా చేసింది. కానీ క్లిక్ అవ్వకపోవడంతో నటుడు రవిరాజాను ప్రేమ వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది.