తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన శ్రీయ శరణ్ ఇప్పటికీ పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. 2018 లో ఈమె రష్యా క్రీడాకారుడు ఆండ్రీ కొస్చీవ్ను సీక్రెట్ గా పెళ్ళి చేసుకుంది.వీళ్ళు రొమాన్స్ చేసుకుంటూ, లిప్ లాక్ లు పెట్టుకుంటూ ఉండే ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. ఇదిలా ఉండగా.. ఫస్ట్ లాక్ డౌన్ టైం లో శ్రీయ ప్రెగ్నెంట్ అయ్యింది.
పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది కూడా..! కానీ ఆ విషయం మీడియాకు లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడింది. గతేడాదిలోనే ఈమె ఆ విషయాన్ని రివీల్ చేసింది. ఇక తాజాగా ఈమె ఫ్యామిలీ స్పెయిన్ లో సందడి చేసింది. అక్కడ తన కూతురుకి ఫోటో షూట్ ను కూడా నిర్వహించింది శ్రీయ. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :