సీనియర్ సినీనటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ హీరోయిన్గా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో వెలుగు వెలిగినటువంటి ఆమని ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పలు సినిమాలలో తల్లి క్యారెక్టర్స్ చేస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ కనిపిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమని మాట్లాడుతూ… సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటినుంచో ఉంది అయితే అప్పట్లో సోషల్ మీడియా అందుబాటులో లేకపోవడం వల్ల ఈ విషయాలు బయటకు తెలిసేది కాదు కానీ ప్రస్తుతం అలా కాదు ప్రతి చిన్న విషయం అందరికీ తెలుస్తోందని తెలిపారు.
ఇండస్ట్రీలో కొన్ని నిర్మాణ సంస్థల నుంచి హీరోయిన్స్ తరచూ ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారని ఆమని తెలిపారు. తాను కూడా ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నానని ఈమె తెలియజేశారు. కెరియర్ మొదట్లో నాకు ఇలాంటి విషయాలపై పెద్దగా అవగాహన లేదు. దీంతో ఒక ఫైనాన్షియర్ సినిమా కథ చెప్పాలని తనని ఒంటరిగా బీచ్ కి రమ్మన్నారు అంటూ ఈ సందర్భంగా ఈమె తెలిపారు. అప్పట్లో ఫోన్స్ లేకపోవడంతో స్వయంగా వెళ్లి వారిని కలవాల్సిందే.
సినిమా కథ చెప్పాలి అంటే దర్శక నిర్మాతలు పిలిపించాలి కానీ ఇలా ఫైనాన్షియల్ రమ్మనడం ఏంటి అని సందేహం వచ్చినటువంటి తన తల్లి అక్కడికి వెళ్ళద్దు అంటూ చెప్పారని ఆమని తెలిపారు. అదేవిధంగా ఒక తమిళ సినిమాలో నటిస్తున్న సమయంలో ఒక సీన్ చేయడం కోసం తనపై ఉన్న బట్టలన్నీ విప్పేయమని కూడా చెప్పారని ఆమని తెలిపారు.
ఆ సినిమాలో తాను (Aamani) ఒక స్విమ్మింగ్ పూల్ సన్నివేశం చేయాల్సి వచ్చింది. దీంతో తన బాడిపై ఎక్కడైనా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో చూడాలని డ్రెస్ మొత్తం విప్పాలి అంటూ తనకి చెప్పారని అయితే వెంటనే నేను ఇలాంటి వాటికి అసలు ఒప్పుకోనని అలాంటి పాత్రలు కూడా చేయడం మానేశాను అంటూ ఈ సందర్భంగా ఇండస్ట్రీలో తనకు ఎదురైనటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి ఆమని చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.