ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఆలియా గతేడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా సీత పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆలియా కూతురి కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇంటి పక్కనే ఉంటుంది.
ఇటీవల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనే అవకాశం రావడంతో కూతురిని విడిచి నాలుగు రోజులు పాటు దూరంగా గడిపింది. ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో అంతర్జాతీయ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ అమ్మడు మరొక అద్భుతమైన అవకాశాన్ని అందుకుంది. తాజాగా అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థ గూచి ఇండియా నుంచి ఫస్ట్ టైమ్ ఆలియా భట్ ను తమ ప్రాడెక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సెలక్ట్ చేసుకోండంతో పాటు.. ఆ విషయాన్ని అఫిషియల్ గా ప్రకటించింది.
ఈ క్రమంలో (Alia Bhatt) ఆలియా భట్ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇక తాజాగా బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్ Gucci Cruise 2024కు హాజరైంది. ఈ ఈవెంట్ లో అలియాభట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో నెటిజన్లు కూడా ఆలియా భట్ గ్లామర్ గురించి పొడుగుతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం అమెను ట్రోల్ చేస్తున్నారు.
అలియాభట్ మంచి డ్రస్ వేసుకోవడంతో పాటు.. చేతిలో ఓ ట్రాన్స్పరెంట్ బ్యాగ్ పట్టుకుంది. దీంతో ఖాళీ బ్యాగ్‌ను ఎందుకు పట్టుకొచ్చింది అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్స్ పై స్పందించిన ఆలియా” అవును.. నా బ్యాగు ఖాళీగానే ఉంది. ఏం చేయమంటారు” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇలా అలియా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.