Anandi: బోల్డ్ సీన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆనంది.. ఏం చెప్పారంటే?

  • January 5, 2024 / 11:22 AM IST

తక్కువ సినిమాలలోనే నటించినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఆనంది ఒకరు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లి తర్వాత షూటింగ్ లకు దూరంగా ఉంటారు. ఒకవేళ సినిమాలలో నటించినా అభినయ ప్రధాన పాత్రల్లో మాత్రమే నటిస్తారు. పెళ్లి తర్వాత రొమాంటిక్ సీన్స్, బోల్డ్ రోల్స్ లో నటిస్తే నెగిటివ్ కామెంట్లు వస్తాయని చాలామంది హీరోయిన్లు ఫీలవుతారు. అయితే ఆనంది మాత్రం పెళ్లి తర్వాత కూడా బోల్డ్ సీన్స్ లో నటించారు.

బోల్డ్ సీన్స్ లో నటించడం గురించి ఆనంది మాట్లాడుతూ ఆ మూవీ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అని అందువల్లే ఆ సినిమాలో నటించానని ఆమె కామెంట్లు చేశారు. ఆ సినిమాలో నటించాలని నా భర్త సూచించాడని ఆనంది పేర్కొన్నారు. ఆనంది చెప్పిన ఆ సినిమా పేరు మంగై కాగా మున్నార్ నుంచి చెన్నైకు ఒంటరిగా ప్రయాణం చేసిన యువతి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

ఒక ఆడపిల్లను మగాడు చూసే కోణం గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమాను తెరకెక్కించామని మేకర్స్ చెప్పుకొచ్చారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మేకర్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. బోల్డ్ సీన్స్, బోల్డ్ డైలాగ్స్ ఉండటంతో మొదట ఈ సినిమాను రిజెక్ట్ చేశానని భర్త ఒక నటిలా ఆలోచించాలని సూచించడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నానని ఆమె కామెంట్లు చేశారు.

భర్త ప్రోత్సాహం వల్లే మంగై సినిమాలో కంఫర్ట్ గా నటించానని ఆమె చెప్పుకొచ్చారు. ఆనంది (Anandi) అసలు పేరు రక్షిత కాగా ఈ తెలుగమ్మాయి తమిళ సినిమాలతో పాపులర్ అయింది. ఆమె భర్త పేరు సోక్రటీస్ కాగా తమిళ కో డైరెక్టర్ గా ఆయన పని చేస్తున్నారు. జాంబీరెడ్డి, మారేడుమిల్లి ప్రజానీకం, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలు తెలుగులో ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus