2023 Rewind: ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?

ఒక భాషలో హిట్ అయిన సినిమాని ఇంకో భాషలోకి రీమేక్ చేయడం అనేది కొత్త పద్ధతి కాదు. ప్రతి ఏడాది రీమేక్ సినిమాలు వస్తుంటాయి. కానీ అందులో అన్నీ సక్సెస్ అవుతాయా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. ఎంత హిట్ సినిమాని రీమేక్ చేసినా.. ఒరిజినల్ లో ఉన్న సోల్ ని మిస్ అవ్వకుండా… ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించాలి. అప్పుడే రీమేక్ సినిమాలు హిట్ అవుతాయి. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. 2023 లో కూడా కొన్ని రీమేక్ సినిమాలు వచ్చాయి. ఇందులో హిట్ అయిన సినిమాలు చాలా తక్కువ. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) హంట్ :

సుధీర్ బాబు హీరోగా మహేష్ సూరపనేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ ఏడాది(2023) జనవరి 26న రిలీజ్ అయ్యింది. ఇది 2013 లో వచ్చిన మలయాళం మూవీ ‘ముంబై పోలీస్’ కి రీమేక్. ‘హంట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అయ్యింది

2) బుట్టబొమ్మ :

అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి శౌరి చంద్రశేఖర్‌ రమేష్‌ దర్శకుడు. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. 2020 లో ఓటీటీలో రిలీజ్ అయిన ‘కప్పెల’ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్లాప్ గా మిగిలింది.

3) రైటర్ పద్మభూషణ్ :

సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాకి షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకుడు. ‘బరెల్లీ కీ బర్ఫీ’ అనే హిందీ సినిమాకి ఇది అనఫీషియల్ రీమేక్. ఈ సినిమాపై కాపీ రైట్ వివాదం కూడా నడిచింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బాగానే ఆడింది.

4) రంగమార్తాండ :

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం.. ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకి కృష్ణవంశీ దర్శకుడు. ‘నటసామ్రాట్’ అనే మరాఠీ సినిమాకి ఇది రీమేక్. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.

5) రావణాసుర :

రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ‘విన్సి డా’ అనే బెంగాలీ మూవీకి అనఫీషియల్ రీమేక్. ‘రావణాసుర’ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

6) బ్రో :

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకి సముద్రఖని దర్శకుడు. 2020 లాక్ డౌన్ టైంలో వచ్చిన ‘వినోదయ సీతమ్’ చిత్రానికి ఇది రీమేక్. కానీ తెలుగులో ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

7) భోళా శంకర్ :

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. 2015 లో తమిళంలో వచ్చిన ‘వేదాళం’ కి రీమేక్. అయితే ‘భోళా శంకర్’ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

8) కోటబొమ్మాళి పీఎస్ :

శ్రీకాంత్ , రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ .. ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకి తేజ మార్ని దర్శకుడు. 2021 లో మలయాళంలో వచ్చిన ‘నాయట్టు’ సినిమాకి ఇది రీమేక్. అయితే ‘కోటబొమ్మాళి పీఎస్’ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

9) మార్టిన్ లూథర్ కింగ్ :

సంపూర్ణేష్ బాబు హీరోగా పూజా కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో యోగి బాబు నటించిన ‘మండేలా’ కి రీమేక్. యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కూడా పోషించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.

10) సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్ :

ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇటీవల రిలీజ్ అయ్యింది.2014 లో కన్నడంలో వచ్చిన ‘ఉగ్రం’ సినిమాకి ఇది రీమేక్. ‘సలార్’ (Salaar) ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus