Anasuya: గిరిజన యువతిగా అనసూయ పాత్ర అలా ఉండబోతుందా?

  • May 30, 2022 / 07:27 PM IST

‘జబర్దస్త్’ తో స్టార్ యాంకర్ లిస్ట్ లో చేరిపోయిన అనసూయ బుల్లితెర పై చేసే గ్లామర్ షో అంతా ఇంతా కాదు. కానీ వెండితెరపైకి వచ్చేసరికి ఆమె పూర్తిగా వైవిధ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గ్లామర్ డోస్ కంటే యాక్టింగ్ కు స్కోప్ ఉండే పాత్రల్నే ఆమె ఎంపిక చేసుకుంటూ ఉంటుంది. ‘క్షణం’ ‘రంగస్థలం’ ‘పుష్ప’ వంటి చిత్రాల్లో అనసూయ పాత్రలు అలాగే వైవిధ్యంగా ఉంటాయి.ఇప్పుడు ఇలాగే మరో వైవిధ్యమైన పాత్రలో ఆమె కనిపించబోతుంది.

గిరిజన యువతి పాత్రలో అనసూయ కనిపించబోతుంది. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో యునైటెడ్ కె ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సునీల్, అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాయిబాబ కోవెలమూడి, వెంక‌ట్ కోవెలమూడి కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వాంటెడ్ పండుగాడ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘పట్టుకుంటే కోటి’ అనేది ఉప శీర్షిక.ఈ చిత్రం నుండీ విడుదల చేసిన అన‌సూయ ఫ‌స్ట్ లుక్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఈ సినిమాలో కూడా ఆమె సునీల్ తో పోరాడుతున్నట్టు పోస్టర్లు వదిలారు. ఈ జంట ‘పుష్ప’ ‘దర్జా’ వంటి సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. స్టార్ రచయితల్లో ఒకరైన జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం.

ఓ బుల్లితెర యాంకర్ అయ్యుండి అది కూడా ఇద్దరు పిల్లలకి తల్లి అయ్యాక కూడా అనసూయ ఇలా లీడ్ రోల్స్ దక్కించుకుంటూ ఉండడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘కథనం’ సినిమా ప్లాప్ అయ్యింది. ‘దర్జా’ రిలీజ్ కు నోచుకోలేక పోతుంది. మరి ఈ వాంటెడ్ పండుగాడు ఏమౌతుందో చూడాలి..!

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus