తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!

కొంతమంది హీరోలు సినిమాల్లోని తమ పాత్రలకి సొంత పేర్లని పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకుంటే అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపినట్టు ఉంటుంది. అలాగే ఆ పాత్రకి కూడా వారు తొందరగా కనెక్ట్ అవుతారనేది వారి ప్రధాన ఉద్దేశం కావచ్చు. ఈ సంస్కృతి ఇప్పటిది కాదు పాత సినిమాల నుండీ వస్తున్నదే. అప్పట్లో రామారావు, నాగేశ్వర రావు,కృష్ణ వంటి వారు తమ సినిమాల్లో పాత్రలకి సొంత పేర్లు పెట్టుకున్నారు. ఆ పేరు పై ఏమైనా పంచ్ డైలాగ్ వస్తే దానిని అభిమానులు తెగ వాడుకునేవారు. ఇప్పుడైతే సోషల్ మీడియా ఉంది కాబట్టి.. ఇప్పుడు మరింత అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పొచ్చు. సరే ఇంతకీ ఏ ఏ హీరోలు తమ సినిమాల్లోని పాత్రలకి తమ పేర్లు పెట్టుకున్నారు. ఓ లుక్కేద్దాం రండి :

1) పవన్ కళ్యాణ్ :

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ‘గోకులంలో సీత’ చిత్రాల్లో తన సొంత పేరుని తన పాత్రకి పెట్టుకున్నాడు.

2) మహేష్ బాబు :

‘బజార్ రౌడీ’ ‘సర్కారు వారి పాట’ చిత్రాల్లో తన సొంత పేరుని తన పాత్రకి పెట్టుకున్నాడు. అలాగే మహేష్ ముద్దు పేరు నాని అని అందరికీ తెలిసిందే. ‘నాని’ అనే టైటిల్ తో సినిమా కూడా వచ్చింది.

3) ఎన్టీఆర్ :

‘బాద్ షా’ చిత్రంలో తన సొంత పేరుని తన పాత్రకి పెట్టుకున్నాడు.

4) చరణ్ :

‘చిరుత’ ‘నాయక్’ ‘ఎవడు’ ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాల్లో తన సొంత పేరునే తన పాత్రలకి పెట్టుకున్నాడు.

5)ప్రభాస్ :

‘డార్లింగ్’ చిత్రంలో తన సొంత పేరునే తన పాత్రకి పెట్టుకున్నాడు.

6) అల్లు అర్జున్ :

‘బన్నీ’ ‘హ్యాపీ’ వంటి చిత్రాల్లో తన ముద్దు పేరు బన్నీని తన పాత్రల పేర్లుగా పెట్టుకున్నాడు.

7) కళ్యాణ్ రామ్ :

‘పటాస్’ ‘ఎం.ఎల్.ఎ’ ‘ఇజం’ వంటి చిత్రాల్లో తన సొంత పేరునే తన పాత్రలకి పెట్టుకున్నాడు.

8) నాని :

‘ఈగ’ ‘ఎం.సి.ఎ(మిడిల్ క్లాస్ అబ్బాయి)’ వంటి చిత్రాల్లో తన సొంత పేరునే తన పాత్రలకి పెట్టుకున్నాడు నాని.

9) వరుణ్ తేజ్ :

‘ఫిదా’ ‘ఎఫ్2’ ‘ఎఫ్3’ వంటి చిత్రాల్లో తన సొంత పేరునే తన పాత్రలకి పెట్టుకున్నాడు.

10) రవితేజ :

‘దేవుడు చేసిన మనుషులు’ ‘నేనింతే’ ‘ఒక రాజు ఒక రాణి’ ‘బలుపు’ వంటి చిత్రాల్లో తన సొంత పేరునే పాత్రల పేర్లుగా పెట్టుకున్నాడు.

11) సాయి ధరమ్ తేజ్ :

‘ఇంటిలిజెంట్’ ‘తేజ్ ఐ లవ్ యు’ ‘ప్రతి రోజూ పండగే’ వంటి చిత్రాల్లో తన సొంత పేరునే పాత్రల పేరుగా వాడుకున్నాడు.

12) నితిన్ :

‘చిన్నదాన నీకోసం’ చిత్రంలో తన సొంత పేరునే పాత్ర పేరుగా పెట్టుకుంటాడు.

13) శర్వానంద్ :

తన మొదటి సినిమా ‘ఐదో తారీఖు’ అనే చిత్రంలో తన సొంత పేరునే పాత్ర పేరుగా పెట్టుకున్నాడు.

14) అఖిల్ :

‘మనం’ ‘అఖిల్’ వంటి చిత్రాల్లో తన సొంత పేరునే పాత్రల పేర్లుగా పెట్టుకున్నాడు.

15) నాగ చైతన్య :

శైలజా రెడ్డి అల్లుడు చిత్రంలో తన సొంత పేరునే పాత్ర పేరుగా పెట్టుకుంటాడు. 5

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus