పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!

కొంతమంది టాలీవుడ్ నటులు, నటీమణులు చాలా వయసు వచ్చినా పెళ్లి చేసుకోవడం లేదు. మరికొంత మందికి మొదటి పెళ్లి కలిసి రాలేదు. అయినా ఇంకో పెళ్లి పై దృష్టి పెట్టడం లేదు. సినిమాలు చేసుకోవడమే మనశ్శాంతి గా ఉన్నట్టు కాలం గడిపేస్తున్నారు.వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) ఆర్.నారాయణ మూర్తి :

పీపుల్ స్టార్ గా పేరొందిన ఆర్.నారాయణ మూర్తి గారికి 66 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. అందుకు కారణాన్ని కూడా ఈయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆయన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని ఇష్టపడ్డారట.పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. ఆ అమ్మాయికి కూడా ఈయనంటే ఇష్టం. కానీ ఆమెది తక్కువ కులం అని చెప్పి నారాయణ మూర్తి గారి తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోలేదట. అందుకే ఆయన పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయారు. కానీ ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు.

2) రజిత :

ఈ టాలీవుడ్ నటి 100 కి పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. కానీ ఈమె పెళ్ళికి దూరంగా ఉంది. తన బంధువుల పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటుంది కానీ ఈమె పెళ్లికి నొ అంటుంది. అందుకు కారణాలు మాత్రం ఈమె ఎక్కడా చెప్పలేదు.

3) విశాల్ :

తెలుగు వాడే అయినప్పటికీ ఇతని ఫ్యామిలీ చెన్నైలో స్థిరపడింది. గతంలో ఇతను వరలక్ష్మీ శరత్ కుమార్ తో ప్రేమాయణం నడిపాడు. కానీ వీళ్ళకి బ్రేకప్ అయ్యింది. అనీషా అనే నటితో ఇతనికి పెళ్లి కుదిరింది. కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. దీనికి కారణాలు ఎవ్వరికీ తెలీదు. అయితే హీరోగా సినిమాలు చేసుకుంటున్నాడు. పెళ్లి గురించి మాత్రం ఆలోచించడం లేదు.

4) ప్రభాస్ :

ఇప్పుడు ప్రభాస్ ఏజ్ 43 ఏళ్లకు అటూ ఇటుగా ఉంది. కానీ ఇతను పెళ్ళి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రేమ, పెళ్లి విషయంలో ఇతని కాలిక్యులేషన్స్ తప్పయ్యాయి అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. కానీ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు.

5) సుమంత్ :

నాగేశ్వర రావు గారి మనవడు, అక్కినేని నాగార్జున మేనల్లుడు అయిన సుమంత్.. గతంలో కీర్తి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అప్పటి నుండీ ఇతను సింగిల్ గానే ఉంటున్నాడు. నటుడిగా కొనసాగుతున్నాడు.

6) సిద్దార్థ్ :

గతంలో మేఘన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల వీళ్ళు విడిపోయారు. ఇప్పుడు సిద్దార్థ్ సింగిల్ గానే ఉంటున్నాడు. నటుడుగా కొనసాగుతున్నాడు.

7) త్రిష :

గతంలో ఈమెకు ఓ వ్యాపారవేత్త తో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయ్యింది. ఇప్పటికీ ఆమె ఒంటరిగానే ఉంటుంది. హీరోయిన్ గా కొనసాగుతుంది.

8) సుబ్బరాజు :

పెళ్లి జరగడం పెద్దల ఒత్తిడి వల్ల అవుతుంది. పెళ్లి చేసుకోవడం అనేది మన ఇష్టంతో జరుగుతుంది. పెద్దల ఒత్తిడితో పెళ్లి జరగడం నాకు నచ్చదు. నాకు చేసుకోవాలి అనిపిస్తే చేసుకుంటాను అంటూ ఇతను ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. 45 ఏళ్ళ వయసొచ్చినా ఇతను పెళ్లి చేసుకోలేదు.

9) అనుష్క :

మన స్వీటీ కూడా ఎందుకో పెళ్లి గురించి ఆలోచించడం లేదు. ఆమెకు లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ ఉంది. పోనీ వరుస సినిమాల్లో కూడా నటించడం లేదు. నచ్చినప్పుడు సినిమాలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతుంది.

10) అమీషా పటేల్ :

తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఈమె కూడా 44 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి గురించి ఆలోచించడం లేదు.

11) హర్షవర్ధన్ :

నటుడు, రైటర్, డైరెక్టర్ అయిన హర్షవర్ధన్ 47 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు కూడా..!

12) టబు :

సీనియర్ స్టార్ హీరోయిన్..! క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన టబు 48 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి గురించి ఆలోచించడం లేదు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus