Anikha surendran: ఆ ప్రపోజల్ తో భయపడిపోయా : అనికా సురేంద్రన్

Advertisement

సినిమా వాళ్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోల కోసం ఫ్యాన్స్ అసోసియేషన్ లు ఏర్పాటు చేశారు. కొందరు హీరోయిన్ల కోసం ఏకంగా గుడి కట్టేసి పూజిస్తున్నారు. అంతగా మన ప్రేక్షకులు తారలను అభిమానిస్తుంటారు. అయితే ఒక్కోసారి ఈ అభిమానం మితిమీరిపోవడంతో తారలు చేదు అనుభవాలు ఎదుర్కొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నానని చెబుతోంది అనికా సురేంద్రన్. పదహారేళ్ల ఈ ముద్దుగుమ్మ అజిత్ నటించిన ‘ఎంతవాడు గానీ’, ‘విశ్వాసం’ వంటి సినిమాల్లో అజిత్ కి కూతురిగా కనిపించింది.

అలానే జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘క్వీన్’ వెబ్ సిరీస్ లో నటించింది. త్వరలోనే ఈమె ఓ మలయాళ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కానుంది. ఇదిలా ఉండగా.. తాజాగా అనికా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా నెటిజన్ ఓ ప్రశ్నను స్నాధించాడు. ‘నీ డై హార్డ్ ఫ్యాన్ నిన్ను ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేసి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరిస్తే ఏం చేస్తావని’ అని ప్రశ్నించాడు.

దానికి అనికా స్పందిస్తూ.. తన జీవితంలో నిజంగానే అలాంటి పరిస్థితి ఎదురైందని చెప్పుకొచ్చింది. ఈమెయిల్ ద్వారా ఓ వ్యక్తి తనకు ప్రపోజ్ చేసి బెదిరించాడని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తను ఎంతగానో భయాందోళనకు గురయ్యానని తెలిపింది. కానీ తరువాత అతడు అలాంటిదేమీ చేయకపోవడంతో కుదుటపడ్డానని చెప్పుకొచ్చింది.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus