Actress Anjali: అలా ఎప్పుడూ అనుకోననంటున్న అంజలి..?
- June 5, 2021 / 08:02 PM ISTByFilmy Focus
తెలుగమ్మాయి అంజలికి తెలుగుతో పోలిస్తే తమిళంలోనే పేరు, గుర్తింపు ఎక్కువగా వచ్చాయి. తెలుగులో అంజలికి అడపాదడపా ఆఫర్లు వస్తున్నా ఆ ఆఫర్లు అంజలి కెరీర్ కు పెద్దగా ఉపయోగపడటం లేదు. ఏప్రిల్ నెలలో విడుదలైన వకీల్ సాబ్ లో అంజలి పాత్రకు మంచి పేరు వచ్చినా అంజలి వరుస ఆఫర్లతో బిజీ కావడం లేదు. అయితే తక్కువగా ఆఫర్లు రావడం గురించి స్పందించిన అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాని ఆఫర్ల కొరకు ఎప్పుడూ బాధ పడనని అంజలి అన్నారు.
తమిళంలో ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తున్న అంజలి వేరే హీరోయిన్ల వల్ల తనకు వచ్చే ఆఫర్లు తగ్గలేదని అన్నారు. ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చినంత మాత్రాన పాత హీరోయిన్లకు ఆఫర్లు తగ్గుతాయని తాను భావించడం లేదని అంజలి చెప్పుకొచ్చారు. మేకర్స్ ఏ పాత్రకు ఎవరు బాగా సూట్ అవుతారో వాళ్లనే ఎంచుకుంటారని అంజలి అభిప్రాయపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఆఫర్ ను మరో హీరోయిన్ లాక్కునే అవకాశం అయితే ఉండదని ఆమె పేర్కొన్నారు.

వేరే హీరోయిన్లు నటించిన పాత్రను నేను చేస్తే బాగుంటుందని తాను ఎప్పుడూ అనుకోలేదని అదే సమయంలో తనకు వచ్చిన పాత్రలకు పూర్తి న్యాయం చేయడానికి కృషి చేస్తానని ఆమె చెప్పారు. తెలుగులో వెంకటేష్, బాలకృష్ణలకు జోడీగా నటించినా అంజలి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయారు. లాక్ డౌన్ సడలింపుల తరువాత అంజలికి తెలుగులో కొత్త సినిమా ఆఫర్లు వస్తాయేమో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!











