“బాహుబలి 2” రిలీజ్ తర్వాత ఇప్పటివరకూ ఏ సినిమా సైన్ చేయకుండా సైలెంట్ గా లండన్ లో హాలీడేస్ ఎంజాయ్ చేసొచ్చిన అనుష్క.. ఎట్టకేలకు ఒక సినిమా సైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం “బాహుబలి” తర్వాత ఒప్పుకొన్న “భాగమతి” కోసం అడపాదడపా డేట్స్ ఇస్తూ గ్యాప్ వచ్చినప్పుడల్లా బెంగుళూరు వెళ్లిపోతోంది. ఈ జర్నీలో ఎంత బిజీ అయిపోయిందంటే.. తనకు అయ్యిందంటే తనకు అత్యంత సన్నిహితుడైన నాగార్జున తనయుడు నాగచైతన్య పెళ్ళికి కానీ రిసెప్షన్ కి కానీ అటెండ్ అవ్వలేనంత.
అయితే.. మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ కెరీర్ మీద కాన్సన్ ట్రేషన్ చేయడం మొదలెట్టింది అనుష్క. మళ్ళీ స్క్రిప్ట్స్ వినడం మొదలెట్టింది, ఒక పది మంది దర్శకులు చెప్పిన కథలు విన్నాక ఫైనల్ గా గౌతమ్ మీనన్ చెప్పిన కథను ఒకే చేసిందట స్వీటీ. ఆల్రెడీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో “ఎంతవాడు గానీ” చిత్రంలో నటించిన అనుష్క.. ఈసారి గౌతమ్ తెరకెక్కించబోయే భారీ మల్టీస్టారర్ లో నటించేందుకు అంగీకరించిందట. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల హీరోలు నటించనున్న ఈ చిత్రం కథానాయిక ప్రాధాన్యమున్న సినిమానట. ఈ నాలుగు భాషల్లోనూ క్రేజ్ ఉన్న కథానాయిక కావడంతోపాటు ఎంతటి బరువైన పాత్రనైనా అవలీలగా పోషించగల దమ్ము ఉన్న హీరోయిన్ కావడంతో అనుష్కను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.