పెళ్లి కోసం పూజలు చేసిన అనుష్క కుటుంబం!
- May 22, 2017 / 09:26 AM ISTByFilmy Focus
స్వీటీ అనుష్క పెళ్లి పనులు మొదలు అయ్యాయా?, త్వరలో పెళ్లి కబురు అందించనుందా? అంటే.. అవుననే అంటున్నాయి శాండిల్ వుడ్ వర్గాలు. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క తర్వాత సినిమా ఏంటి అని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న అభిమానులకు ఈ విషయం షాక్ కి గురిచేస్తోంది. 35 ఏళ్ళ అనుష్క ఈ ఏడాది పెళ్లిచేసుకోబోతున్నట్లు కన్నడ పత్రికలూ వార్తలు ప్రచురించాయి. మొన్న అనుష్క కుటుంబ సమేతంగా కర్ణాటక లోని మూకాంబిక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసారని, అది పెళ్లికి ముందు దోషాలు దోషాలు తొలిగిపోవాలని చేసే పూజలని వెల్లడించాయి.
కొన్ని రోజుల క్రితం అనుష్క తన వ్యక్తిగత సిబ్బందిని తొలిగించిన సంగతిని గుర్తు చేస్తూ.. ఆమె కొత్త సినిమాకు సైన్ చేయడం లేదనే విషయాన్నీ కథనంలో ప్రస్తావించింది. ఈ కారణాలు పరిశీలిస్తే అనుష్క త్వరలో పెళ్లి పీఠలు ఎక్కడం ఖాయమనిపిస్తోంది. ప్రస్తుతం అనుష్క భాగమతి సినిమా చేస్తున్నారు. అశోక్ (పిల్ల జమీందార్ ఫేం) దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఆగస్టు లో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా విడుదలయిన వెంటనే అనుష్క పెళ్లి వార్త అధికారికంగా ప్రకటించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















