‘చిన్నారి పెళ్ళి కూతురు’ అనే డబ్బింగ్ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అవికా గోర్…తర్వాత హీరోయిన్ గా మారి ‘ఉయ్యాల జంపాల’ ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ‘రాజు గారి గది3’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.ఇదిలా ఉండగా.. గతంలో ఈమె బరువు పెరిగింది అనే ఒక్క కారణంతో చాలా సినిమాల నుండీ ఈమెను తప్పించారు. ఓ రోజు అద్దంలో తనను తాను చూసుకుని రాత్రంతా నిద్ర పోకుండా ఏడుస్తూనే ఉన్నట్టు ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఎన్నో వర్కౌట్లు చేసి బరువు తగ్గిందట. ఇప్పుడు ఈ అమ్మడు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా కాన్ఫిడెన్స్ ను సంపాదించుకుంది అని స్పష్టమవుతుంది. విషయం ఏమిటంటే.. ఇటీవల అవికా గోర్ వద్దకు ఓ బ్యూటీ క్రమ్స్ ఎండోర్స్ ఆఫర్ వస్తే దాన్ని తిరస్కరించింది. ఈ విషయం పై ఆమె మీడియాతో మాట్లాడుతూ…. “అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు జనాలు బయట కనిపించే అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇన్స్పిరేషన్ అంటే బయట కనిపించే అందం అనుకోవడం వట్టి అపోహ.
అది చాలా తప్పు కూడా. మనం ఎన్నో ఏళ్ళుగా ప్రకటనలను చూస్తున్నాం. అందులో ఎక్కువగా బయట కనిపించే అందాన్ని నిజమైన అందంగా పరిగణిస్తున్నారు. కానీ అది నిజం అని నేను ఎప్పుడూ అనుకోలేదు. దానికి ప్రాధాన్యత ఇవ్వాలని నేను ఆలోచించను లేదు. బ్యూటీ క్రీమ్‌లతో వచ్చే అందం తాత్కాలికమే.మంచి వ్యక్తిత్వమే అసలైన అందం.అబద్దాన్ని ప్రచారం చేయడానికి నా మనసు ఒప్పుకోదు. సరైన ఆహారం తీసుకోవాలి.అందం అంటే ముందుగా బ్యూటీ క్రీంలను గుర్తు చేసుకునే పద్ధతి మారాలి. యువతను పక్క దారి పట్టించే బ్యూటీ క్రీం ల కమర్షియల్ యాడ్స్ ను నేను అందుకే పక్కన పెట్టాను” అంటూ ఈమె చెప్పుకొచ్చింది.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!