ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతోంది సీనియర్ నటి భాగ్యశ్రీ. ఈ సినిమాలో ఆమె ప్రభాస్ తల్లిగా కనిపించబోతున్నాడని సమాచారం. ప్రభాస్ తల్లిగా ఆమెనే ఎందుకు తీసుకున్నారు..? పాన్ ఇండియా అప్పీల్ కోసమే ఆమెను తీసుకున్నారా..? అనే విషయాలపై స్పందించింది నటి భాగ్యశ్రీ. తను ‘రాధేశ్యామ్’ సినిమా ఒప్పుకోవడానికి గల కారణాన్ని బయటపెట్టింది. యూవీ క్రియేషన్స్ లాంటి లాంటి పెద్ద బ్యానర్, దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చెప్పిన కథ నచ్చడం, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో కావడం..
ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమా ఒప్పుకోవడానికి కారణాలని అలానే ఈ సినిమా ఒప్పుకోవడానికి మరో బలమైన కారణం ఉందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో తన రోల్ చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందని.. తను మంచి డాన్సర్ కానప్పటికీ.. ఈ సినిమాలో డాన్స్ చేశానని చెప్పింది. ఈ కథ అలాంటిదని.. అందుకే సినిమా చేయడానికి అంగీకరించినట్లు చెప్పుకొచ్చింది. ఇలా ‘రాధేశ్యామ్’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక అసలు కారణాన్ని బయటపెట్టింది భాగ్యశ్రీ.
మొదటిరోజు సెట్స్ లో ప్రభాస్ ను కలిసినప్పుడు.. ఎలా పరిచయం చేసుకోవాలా..? అని ఆలోచించానని కానీ సెట్స్ పైకి వచ్చిన ప్రభాస్ స్వయంగా తన దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నాడని చెప్పింది. చిన్నప్పటి ఫ్యాన్స్ అని కూడా చెప్పడంతో షాకయ్యాయని తెలిపింది భాగ్యశ్రీ. ఈ నెల 11న ‘రాధేశ్యామ్’ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన సినిమా రిలీజ్ ట్రైలర్ కూడా అంచనాలను పెంచేసింది. మరి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి!
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!