వర్తమాన నటి-గాయని ఆత్మహత్య!

  • July 19, 2017 / 06:59 AM IST

సినిమా పరిశ్రమని ఏదో తెలియని దరిద్రం పట్టి పీడిస్తుంది అని గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఇట్టే అర్ధం అయిపోతుంది. ఎందరో మహానుభావులు కాలం చేశారు అందులో దర్శకరత్న దాసరి, ప్రముఖ పాటల రచయిత సీ. నారాయణ రెడ్డి గారు, ఉండగా, అదే క్రమంలో కాస్త గ్యాప్ లో ప్రముఖ హీరో రవితేజ తమ్ముడు భరత్ యాక్సిడెంట్ లో మరణం చెందడం నిజంగా టాలీవుడ్ తట్టుకోలేనంత విషాదం అని చెప్పవచ్చు…సరే టైమ్ బాలేదు అందుకే ఈ అనుకోని సంఘటనలు తలెత్తుతున్నాయి అని అనుకుంటే మరో పక్క డ్రగ్స్ గోల ఇండస్ట్రీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు బాలీవుడ్ లో కూడా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు యంగ్ హీరోయిన్లు, టివి మోడల్స్, అప్ కమింగ్ నటీమణులు ఆత్మహత్య చేసుకోగా మరొకరు హత్యకు గురయ్యారు.  అసలు విషయం ఏమిటి అంటే…తాజాగా బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఎవ్వరూ ఊహించని పరిణామం అందరినీ కలచి వేస్తుంది…అసలేం జరిగింది అంటే…ఈ మద్య తన నటన, సంగీతంతో అశేష ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న నటి, గాయని బిదిశా బెజ్బరువా అనుమానాస్పదరీతిలో ప్రాణాలు కోల్పోయింది.

అస్సామీ నటిగా పాపులరయిన ఆమె ఢిల్లీలోని తన ఫ్లాట్ లో ఉరివేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ లో అద్భుతంగా రాణిస్తున్న ఈ నటి ఇలా అనుకోకుండా ప్రాణాలు తీసుకోవడం నిజంగా అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది…ఇక మరో కోణంలో ఆరా తీస్తే…. ఆమెకు గ‌త ఏడాది గుజరాత్‌కు చెందిన నిశీత్ ఝాతో పెళ్లి జ‌రిగింది. నిశీత్‌ కుటుంబీకులు స‌ద‌రు న‌టిని వేధింపులకు గురిచేయడంతో ఆమె వేరుగా ఉంటోంది. భర్తతో మాత్రం ఆమె సత్సంబంధాలు కొన‌సాగిస్తోంది. ఇక వీటన్నింటినీ బేస్ చేసుకుని తల్లితండ్రులు ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడంతో పోలీసులు వివిధ కోణాల్లో ఈ కేస్ ను టేక్ అప్ చేసి విచారణ చేపట్టనున్నారు. మొత్తంగా ఒక యువ నాటి ఇలా ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus