ప్రేమ..సృష్టిలో స్వచ్ఛమైనది….పవిత్రమైనది…ఇంకా చెప్పాలి అంటే చాలా బలం అయినది. ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారు చాలామంది ఉన్నారు. ఇక ఆ కోవలో మన టాలీవుడ్ తారలు సైతం ఉండడం విశేషం. ప్రేమ వివాహం చేసుకునేందుకు తమ మతాన్ని సైతం కాదని మతం మార్చుకున్న అందాల భామలను ఒక సారి చూద్దాం రండి…
కుష్బూ – ప్రముఖ తార కుష్బూ సహజంగా ముస్లిం మతానికి చెందిన యువతి. అయితే ప్రముఖ దర్శకుడు సుందర్ ను వివాహం చేసుకునే క్రమంలో ఆమె హిందూ మతాన్ని తీసుకున్నారు.
మోనికా – 2000ల కాలంలో అందాల తారగా మంచి పాత్రల్లో ఒదిగిపోయిన మోనికా….తన మతాన్ని మార్చుకుని ఇస్లాం మతంలోకి మారి, తను ప్రేమించిన చెన్నై వ్యాపారవేత్తని పెళ్ళిచేసుకుంది.
నయనతార – క్రిస్టన్ మతానికి చెందిన నయనతార…ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభు దేవాను పెళ్లి చేసుకోవాలి అని అనుకుని హిందూ మతాన్ని తీసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వారి పెళ్లి జరగలేదు.
నగ్మా – తారల్లో నగ్మ కధ కాస్త వింతగా ఉంటుంది. ఆమె తల్లి ముస్లిం, ఆమె తండ్రి హిందూ. అయితే క్రిస్టన్ మతం ప్రిన్సిపల్స్ తనకు బాగా నచ్చడంతో ఆమె 2007లో బాప్తిసమ్ తీసుకుంది.