నిన్న జరిగిన మంగ్లీ (Mangli) పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు రైడ్ చేయడం. అక్కడ డ్రగ్స్, గంజాయి, భారీగా విదేశీ మద్యం పోలీసులకి లభించాయి. 40 కి పైగా సెలబ్రిటీలు ఈ పార్టీలో పాల్గొన్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించగా 9 మందికి గంజాయి పాజిటివ్ రావడం అందరికీ షాకిచ్చే అంశంగా చెప్పుకోవాలి. ఈ 9 మందిలో బిగ్ బాస్ బ్యూటీ దివి (Divi) కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
దివి (Divi)) మాట్లాడుతూ… “మంగ్లీ (Mangli) పుట్టినరోజు వేడుకలకు నేను కూడా వెళ్లాను. అది నిజమే. అక్కడ డ్రగ్స్, గంజాయి, మద్యం గురించి నాకు తెలియదు. పోలీస్ రైడ్ గురించి తెలిసి నేను షాక్ అయ్యాను. అక్కడ జరిగిన తప్పులు మాపై మోపడం అనేది సరైన పద్ధతి కాదు.
మీడియా వాళ్ళు ప్రూఫ్స్ వంటివి లేకుండా మా ఫోటోలు వేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. మీ వద్ద ప్రూఫ్స్ ఉంటే వేసుకోండి. అప్పుడు మేము మాట్లాడాము. మీరు కూడా మీ ఫ్రెండ్స్ బర్త్ డే అయితే వెళ్తారు కదా.
అక్కడేదో పొరపాటు జరిగితే దానికి మీరు బాధ్యత వహించాలి అంటే ఎలా? మంగ్లీ నాకు ఫ్రెండ్. మంచి అమ్మాయి కూడా..! మీ అందరికీ తెలుసు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అక్కడ ఏదో తప్పు జరిగింది. అందుకు నేను బాధ్యురాలిని కాదు. దయచేసి నా ఫోటోలు వాడకండి. నా కెరీర్ కి ఇబ్బంది ఎదురవుతుంది. దాని గురించి కూడా ఆలోచించండి. థాంక్యూ” అంటూ చెప్పుకొచ్చింది.