‘బిగ్ బాస్ 4’ ఫేమ్ దివి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఫోటో షూట్లలో పాల్గొంటుంది. అలా అని అందరి భామల్లా మితి మీరిన గ్లామర్ షో చేయడం లేదు. చాలా పద్ధతిగానే తన పరిమితుల్లో ఉంటూ సహజంగా అందాలను వడ్డిస్తుంది. మొన్నామధ్య హైదరాబాద్ టైమ్స్ వారు నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2020 టీవీ నటీమణుల కేటగిరిలో.. దివి ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.అటు తర్వాత ఆమె ఇమేజ్ మరింతగా పెరిగిందనే చెప్పాలి.
‘అందం అనేది క్యారెక్టర్ కు సంబంధించినది.అదే నా దృష్టిలో అందం అంటే..!అందరూ బాహ్య రూపాన్నే చూస్తారు కానీ నేను మాత్రం దానినే బలంగా నమ్ముతాను’ అంటూ తెలిపి ఈమె కాన్ఫిడెన్స్ ఏంటన్నది ప్రూవ్ చేసింది దివి.హైదరాబాద్ కు చెందిన ఈ అమ్మాయి ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించింది. అటు తర్వాత మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ మూవీలో కూడా నటించింది.అప్పుడు దివి ఎవరు అన్న విషయం ప్రేక్షకులకు పెద్దగా తెలీదు.
అయితే ‘బిగ్ బాస్ 4’ లో ఈమె కంటెస్టెంట్ గా పాల్గొన్న తర్వాత మంచి క్రేజ్ ను సంపాదించుకుంది దివి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ అమ్మడు వంకాయ రంగు చీరలో చాలా చక్కగా రెడీ అయ్యి.. ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.ఈ ఫోటోలు నిజంగా వావ్ అనిపించే విధంగానే ఉన్నాయని చెప్పాలి.వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :