Jr NTR: వార్2 సినిమాలో తారక్ కు జోడీ ఫిక్స్.. ఆమె నటించనున్నారా?

  • February 12, 2024 / 05:57 PM IST

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ దేవరలో మొదట అలియా భట్ హీరోయిన్ గా ఎంపికయ్యారు. అధికారికంగా ప్రకటించకపోయినా అలియా భట్ హీరోయిన్ అని మేకర్స్ అప్పట్లో కన్ఫామ్ చేశారు. అదే సమయంలో అలియా భట్ గర్భవతి కావడంతో ఈ సినిమా ఆఫర్ ను ఆమె సున్నితంగా తిరస్కరించడం ఆమె స్థానంలో జాన్వీ కపూర్ ఎంపిక కావడం జరిగింది. సైఫ్ అలీఖాన్ గాయం వల్ల దేవర షూట్ తాత్కాలికంగా వాయిదా పడింది.

దేవర కొత్త రిలీజ్ డేట్ గురించి వచ్చే నెలలో మేకర్స్ నుంచి అధికారికంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. అయితే వార్2 సినిమాలో అలియా భట్ (Jr NTR) తారక్ కు జోడీగా ఫిక్స్ అయ్యారని భోగట్టా. ఈ సినిమా షూట్ ముంబైలో జరిగే అవకాశం ఉండటంతో అలియా భట్ సులువుగానే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది. దేవర సినిమా రిలీజ్ వాయిదా పడటం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.

ఈ సినిమాపై ఏర్పడిన అంచనాలకు అనుగుణంగా సినిమాను రిలీజ్ చేసి ఉంటే మాత్రం సినిమా వేరే లెవెల్ లో ఉండేదని నెటిజన్లు చెబుతున్నారు. అయితే కొన్నిసార్లు ఆలస్యంగా విడుదలైనా అద్భుతాలు జరిగే సందర్భాలు అయితే ఉంటాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రాజెక్ట్ కే రిలీజైన నెల, రెండు నెలల తర్వాత దేవర రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఆగష్టు, సెప్టెంబర్ లలో పుష్ప2, గేమ్ ఛేంజర్ సినిమాలు షెడ్యూల్ అయ్యాయి.

ఈ ఏడాది విడుదల కానున్న ప్రతి పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. ప్రాజెక్ట్ కే, దేవర, పుష్ప2, గేమ్ ఛేంజర్ సినిమాల బడ్జెట్ 1800 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఈ సినిమాలకు బిజినెస్ సైతం రికార్డ్ స్థాయిలో జరుగుతుండగా ఎంతమంది హీరోలు అంచనాలను అందుకుంటారో చూడాలి. దేవర గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందో తెలియాల్సి ఉంది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus