Eagle Review in Telugu: ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 9, 2024 / 01:23 PM IST

Cast & Crew

  • రవితేజ (Hero)
  • అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ (Heroine)
  • నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధూ, వినయ్ రాయ్, శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్ తదితరులు.. (Cast)
  • కార్తీక్ ఘట్టమనేని (Director)
  • టి.జి.విశ్వప్రసాద్ - వివేక్ కూచిభోట్ల (Producer)
  • దవ్జాండ్ (Music)
  • కార్తీక్ ఘట్టమనేని - కమిల్ ప్లోకి - కర్మ్ చావ్లా (Cinematography)

“రావణాసుర, టైగర్ నాగేశ్వర్రావు” వంటి ఫ్లాప్స్ అనంతరం ఎట్టిపరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ ఫ్లాప్ అనేది రాకూడదు అనే ధ్యేయంతో రవితేజ నటించిన తాజా చిత్రం “ఈగల్”. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా తన రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్ మంచి అంచనాలు నమోదు చేసింది. మరి సినిమా రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చి హిట్ కొట్టాడో లేదో చూద్దాం..!!

కథ: ఢీలీలో జర్నలిస్ట్ నళిని (అనుపమ పరమేశ్వరన్) తలకోనలో ఉత్పత్తయ్యే ప్రత్తి గురించి రాసిన ఓ చిన్న వ్యాసం పెనుదుమారం రేపుతుంది. నేషనల్ ఇంటిలిజెన్స్ బ్యూరో రంగంలోకి దిగి.. నళినిని కొన్ని గంటలపాటు ఇంటరాగేట్ చేస్తుంది. అసలు ఎక్కడో తలకోనలో ప్రత్తి గురించి రాస్తే.. ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో ఎందుకు రియాక్ట్ అయ్యింది అనే యాంగిల్ నుండి ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిన నళినికి.. ఈ కథ మొత్తానికి మూలకారకుడు సహదేవ్ (రవితేజ) అని తెలుస్తుంది. అసలు సహదేవ్ ఎవరు? మార్గశిర మధ్యరాత్రి ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం కోసం నళిని మొదలెట్టిన ప్రయాణం ఏ తీరానికి చేరుకుంది? అనేది “ఈగల్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: గత పదేళ్ళలో రవితేజ సినిమాలు తీసుకుంటే.. ఒక పాత్ర కోసం కాస్త ఎఫర్ట్ పెట్టి మేకోవర్ చేసుకున్న క్యారెక్టర్ ఇదే అని చెప్పాలి. సహదేవ్ పాత్రను రవితేజ ఎంతగా నమ్మాడు అనేదానికి ఇదో ఉదాహరణ. రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో రవితేజ ఒదిగిపోయి.. క్యారెక్టర్లో జీవించేశాడు. ముఖ్యంగా రకరకాల గన్స్ ను రవితేజ హ్యాండిల్ చేసే విధానం చాలా సహజంగా ఉంది.

అనుపమ పరమేశ్వరన్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా అలరించింది. నవదీప్ కి చాన్నాళ్ల తర్వాత మంచి రోల్ లభించింది. తన ప్రెజన్స్ & డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. అజయ్ ఘోష్, అవసరాల శ్రీనివాస్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: కార్తీక్ ఘట్టమనేని – కర్మ్ చావ్లా – కమిల్ ప్లోకి త్రయం సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. స్నైపర్ స్టైల్ ఫ్రేమింగ్స్ & డ్రోన్ షాట్స్ భలే ఉన్నాయి. 70 ఎం.ఎం స్క్రీన్ పై ఆ షాట్స్ చూడడానికి బాగుంటుంది. అలాగే.. సీజీ వర్క్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఆడియన్స్ కు మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ విషయంలో ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదు అని అర్ధమవుతుంది. దవ్జాండ్ నేపధ్య సంగీతం మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. మాటల రచయిత మణిబాబు కరణం డైలాగులు బాగున్నా.. ప్రాసలు మరీ ఎక్కువైపోయాయి.

అందువల్ల ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన డైలాగులు బోర్ కొట్టిస్తాయి. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రాసుకున్న కథలో నిజాయితీ ఉంది. తెరకెక్కించిన విధానం కూడా హాలీవుడ్ స్థాయిలో ఉంది. అయితే.. అనుపమ పాత్ర ద్వారా కథనాన్ని నడిపిన విధానం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే పేటర్న్ “కె.జి.ఎఫ్”ను గట్టిగా గుర్తు చేస్తుంది. అలాగే.. సెకండ్ పార్ట్ కోసం ఇచ్చిన లీడ్ కూడా అదే స్థాయిలో ఉంది. ఆ “కె.జి.ఎఫ్” మార్క్ కనిపించకుండా.. స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగా రాసుకొని ఉంటే బాగుండేది. ఓవరాల్ గా దర్శకుడిగా మాత్రం తమ మార్క్ చూపించాడు కార్తీక్ ఘట్టమనేని. ఈ చిత్రానికి ఎడిటర్ కూడా తానే అవ్వడం ఇంకాస్త ప్లస్ అయ్యింది.


విశ్లేషణ:  మునుపెన్నడూ చూడని రవితేజను చూస్తారు ఆడియన్స్, యాక్షన్ బ్లాక్స్, సంగీతం, ఎలివేటింగ్ & కెమెరా వర్క్ అద్భుతంగా ఉన్నాయి. వీటికోసం (Eagle) ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడొచ్చు.

రేటింగ్: 2.75/5

Click Here to Read in ENGLISH

Rating

2.75
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus