టాలీవుడ్లో నెంబర్ 1 యాంకర్ అంటే సుమ అనే చెబుతారు. అందులో డౌటే లేదు. అయితే ఆమె తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరైన యాంకర్ గురించి చెప్పాలి అంటే గాయత్రి భార్గవి అనే చెప్పాలి. ఈమె కెరీర్ ప్రారంభంలో కొన్ని మ్యూజిక్ ఛానల్స్ లో పనిచేసింది.హాఫ్ టికెట్ అనే షోతో ఈమె పాపులర్ అయ్యింది. అటు తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని వదిన, పిన్ని వంటి పాత్రల్లో నటిస్తూ వస్తుంది.
ఇప్పటివరకు ఆమె 50 కి పైగా సినిమాల్లో నటించింది.ఈ విషయం బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. అందులో ‘అత్తారింటికి దారేది’ ‘బలాదూర్’ ‘జనతా గ్యారేజ్’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి చిత్రాలు ఉన్నాయి.అలాగే ఓటీటీల కోసం రూపొందే సినిమాలు, వెబ్ సిరీస్ లు వంటి వాటిలో కూడా ఈమె నటిస్తోంది. అంతేకాదు సినిమాలకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ లకి హోస్ట్ చేస్తూ బిజీగా గడుపుతోంది.
ఇప్పటివరకు గాయత్రి భార్గవి ని చీరల్లో చాలా ట్రెడిషనల్ గా మాత్రమే చూసుంటారు. అయితే ఆమె ట్రెండీ లుక్ లో కూడా ప్రేక్షకులను అలరించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి కొన్ని రేర్ ఫోటోలను ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :