హేమ.. పరిచయం అవసరం లేని పేరు.1989లో వచ్చిన ‘చిన్నారి స్నేహం’ అనే చిత్రంతో ఈమె ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగుతో పాటు తమిళ,హిందీ భాషల్లో కలిపి ఇప్పటికి 200లకు పైగా సినిమాల్లో నటించింది.ఇంకా నటిస్తూనే ఉంది.1967 లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజోలులో జన్మించిన హేమ వయసు.. ఇప్పటికి 53 ఏళ్ళు. హేమకు పెళ్ళీడుకొచ్చిన కూతురు కూడా ఉంది. అయినప్పటికీ ఈమెను ఎవరైనా ఆంటీ అని పిలిస్తే చాలా ఇబ్బందిగా ఫీలవుతుందట.ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా చెప్పే హేమ..
ఈ విషయాన్ని కూడా మొహమాటం లేకుండా చెప్పుకొచ్చింది. కుర్రాళ్ళు ఎవరైనా ఈమెను ఆంటీ అని పిలిస్తే ‘అలా పిలవద్దు’ అని మొహం మీదే చెప్పేస్తుంటుందట. ఇక హీరోలు ఎవరైనా అలా పిలిస్తే.. సైకిల్ గ్యాప్ కూడా ఇవ్వకుండా.. హీరో షాట్లో ఉన్నా సరే వెళ్లి అలా పిలవద్దు అని చెప్పేస్తుంటుందట. హీరోలు అలా పిలిస్తే.. తనకు వయసు పెరిగిపోయిన ఫీలింగ్ వస్తుందని ఆమె చెబుతుంది. అది నిజమే అయినప్పటికీ ఆమెలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందని కూడా చెప్పుకొస్తుంది ఈ సీనియర్ నటి.
సినిమాల్లో కూడా ఈమె వదిన, అత్త వంటి పాత్రలు పోషిస్తుండడంతో కొంతమంది ఆమెను ఆంటీ అని పిలుస్తుంటారట. ఇక ఇప్పుడు ఈమె తల్లి పాత్రలు కూడా పోషిస్తుండడం గమనార్హం. ఇక ఇటీవల తన భర్త పుట్టినరోజుని స్విమ్మింగ్ పూల్ లో జరిపిన హేమ.. అతనికి డీప్ లిప్ లాక్ కూడా ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.