అప్పట్లో వ్యాంప్ పాత్రలు చేసి తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసింది నటి జయలలిత. ఈమె గ్లామర్ షో చూసి అప్పట్లో హీరోయిన్లకు కూడా చమటలు పట్టేవట. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ‘ఇంద్రుడు చంద్రుడు’ చిత్రం ఈమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా ఈమె తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ,హిందీ భాషల్లో కలుపుకుని మొత్తం 650 కి పైగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈమె పలు సీరియల్స్ లో కూడా నటిస్తుంది.
ఈమె ఓ బ్రాహ్మణ మహిళ. ఈమె సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎందుకు సినిమాల వైపు వస్తున్నావ్?పెళ్లి చేసుకుని మంచి జీవితం గడుపు అని కె.విశ్వనాథ్ గారు చెప్పారట. కానీ ఈమె ఆయన మాట వినిపించుకోలేదట. ఆయన మాట కాదన్నందుకు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని ఈమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా జయలలిత ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందట. దాదాపు 7 ఏళ్ళ పాటు ఈమె ఓ వ్యక్తిని ప్రేమించిందట.
కానీ ఆ వ్యక్తి ఈమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుందాం అని తొందర పెట్టాడట. ఈమెకు ఓ పక్కన అనుమానంగా ఉన్నప్పటికీ.. ప్రేమించినందుకు అతని మాట కాదనలేకపోయిందట. ఈమె పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా.. తను దాచుకున్న డబ్బు, నగలతో అతన్ని వివాహం చేసుకుందట. కానీ జయలలిత ప్రేమించిన వ్యక్తి.. కేవలం అతని అప్పులు తీరే వరకు ఈమెతో ఉంది.. తర్వాత వదిలేసాడట. ఏడాది కూడా ఈమె పెళ్లి నిలబడలేదని ఓ సందర్భంలో ఈమె తెలియజేసింది.