Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Actress: అవకాశాల్లేక ఇబ్బందిపడుతుంటే.. ఇలాంటి సినిమాలు తీస్తారా? కరణ్‌పై హీరోయిన్‌ ఫైర్‌

Actress: అవకాశాల్లేక ఇబ్బందిపడుతుంటే.. ఇలాంటి సినిమాలు తీస్తారా? కరణ్‌పై హీరోయిన్‌ ఫైర్‌

  • July 30, 2023 / 05:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: అవకాశాల్లేక ఇబ్బందిపడుతుంటే.. ఇలాంటి సినిమాలు తీస్తారా? కరణ్‌పై హీరోయిన్‌ ఫైర్‌

బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ వర్సెస్‌ కరణ్‌ జోహార్‌… ఈ వార్‌ ఇప్పటిది కాదు, ఇంత త్వరగా తేలేలా లేదు, తేల్చేలా కూడా లేదు. ఎందుకంటే అవకాశం చిక్కినప్పుడల్లా కరణ్‌ మీద కారాలు మిరియాలు భారీ ఎత్తున నూరుతూ ఉంటుంది. కరణ్‌ జోహర్‌ నుండి సినిమా వచ్చినా, వస్తున్నా, వస్తాదని తెలిసినా.. కంగన రెడీ అయిపోతుంది. అదే స్టైల్‌ను కరణ్‌ నుండి కంగనకు కౌంటర్లు పడవు. ఆ విషయం పక్కనపెడితే లేటెస్ట్‌గా కంగన వేసిన కౌంటర్లు బాగా వైరల్‌ అయ్యాయి.

కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహించిన ‘రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ’ సినిమాను విమర్శిస్తూ కంగన రనౌత్‌ ఇన్‌స్టాలో వరుస పోస్టులు పెట్టింది. కరణ్‌ దర్శకత్వం, రణ్‌వీర్‌ సింగ్‌ డ్రెస్సింగ్‌ స్టైల్‌పై కంగన రనౌత్‌ తీవ్రంగా మండిపడింది. అంతేకాదు రూ.250 కోట్లతో కరణ్‌ జోహార్‌ ఓ డైలీ సీరియల్‌ తీశారని ఎద్దేవా చేసింది. ప్రేక్షకులను ఇక మోసం చేయలేరు. ఇలాంటి ఫేక్‌ సెట్స్‌, కాస్ట్యూమ్స్‌ను వాళ్లు అంగీకరించరు అని ప్రేక్షకులను ఉద్దేశిస్తూ పోస్ట్‌లో రాసుకొచ్చింది.

సినిమాను ఉద్దేశిస్తూ… నిజ జీవితంలో ఎవరైనా ఇలాంటి దుస్తులు ధరిస్తారా? 90ల్లో కరణ్‌ జోహర్‌ తెరకెక్కించిన చిత్రాలనే కాపీ కొట్టి రూ.250 కోట్ల బడ్జెట్‌తో ‘రాకీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహాని’ సినిమా చేసినందుకు కరణ్‌ జోహార్‌ సిగ్గుపడాలి అంటూ పెద్ద మాటలే అనేసింది కంగన. టాలెంట్‌ ఉన్నవాళ్లు సరైన డబ్బులు లేక, అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటే ఇంత డబ్బు ఆయనకు ఎవరు ఇచ్చారు అని కంగన (Actress) ప్రశ్నించింది.

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బును వృథా చేయడం మానేసి రిటైర్‌ అయిపోవడం మంచిది అని సూచించింది కంగన. లేకపోతే కొత్త టాలెంట్‌కు అవకాశాలు కల్పించు అని చెప్పింది. ఇక రణ్‌వీర్‌కు నేనిచ్చే సూచన ఒక్కటే అంటూ మరో విషయం చెప్పింది. డ్రెస్సింగ్‌ విషయంలో నువ్వు కరణ్‌ జోహార్‌ను ఫాలో అవ్వొద్దు. సాధారణ వ్యక్తుల మాదిరిగా దుస్తులు ధరించు అని సూచించింది. అంతేకాదు కావాలంటే దక్షణాది నటులు ఎంత హుందాగా దుస్తులు ధరిస్తారో చూడు అంటూ సలహా కూడా ఇచ్చింది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Alia Bhatt
  • #Kangana Ranaut
  • #karan johar
  • #Ranveer Singh

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వీకెండ్..ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhurandhar: నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చేస్తున్నారు… ‘ధురంధర్‌’పై డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

29 mins ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

5 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

6 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

13 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

15 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

1 day ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

1 day ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version