Kasthuri: లంగా వోణి కట్టిన 49 ఏళ్ల బ్యూటీ.. వైరల్ అవుతున్న కస్తూరి లేటెస్ట్ ఫోటోలు !

‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కస్తూరి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఈ సీరియల్ లో అమాయకపు గృహిణిగా ఈమె ప్రదర్శించే నటన మామూలుగా ఉండదు. అయితే ఈమె నిజ జీవితానికి.. ఆ సీరియల్ లో పాత్రకు అస్సలు సంబంధం లేదు.గొడవలకు దిగితే ఈమె అస్సలు తగ్గదు. గతంలో కోలీవుడ్ స్టార్ హీరో అయిన అజిత్ కుమార్ ఫ్యాన్స్‌తోనే గొడవకు దిగి వాళ్లకు మూడు చెరువుల నీళ్లు తాగించింది.

సీరియల్ లో చీరలు కట్టుకుని చాలా పద్దతిగా వ్యవహరించే ఈమె.. నిజజీవితంలో మాత్రం చాలా మోడరన్ గా ఇంకా చెప్పాలంటే బోల్డ్ గా ఉంటుంది అని చెప్పాలి. సోషల్ మీడియాలో నిత్యం తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుంది. 48 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు పోటీగా గ్లామర్ షో చేస్తుంటుంది ఈ అమ్మడు. మొన్నటికి మొన్న బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో అదిపోయే ఫోజులు ఇస్తున్న వీడియోను షేర్ చేసిన కస్తూరి తాజాగా లంగా వోణిలో దిగిన ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోలకు కూడా ఈమె తనదైన గ్లామర్ ఫోజులు దట్టించింది. ఈ ఫోటోలకు నెటిజన్లు వావ్, సూపర్, హీరోయిన్ లా ఉన్నారు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈమె ఇన్స్టా ఖాతాకి 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus